Sabarimala Bike Rent: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్... బైక్ అద్దెకు తీసుకోవచ్చు

Sabarimala Bike Rent | బైక్ నడిపేవారు డ్రైవింగ్ లైసెన్స్ డిజిటల్ కాపీతో పాటు అడ్రస్ ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలి. భక్తులకు బైక్‌తో పాటు హెల్మెట్ కూడా అందిస్తుంది ఈ సంస్థ.

news18-telugu
Updated: December 3, 2019, 5:24 PM IST
Sabarimala Bike Rent: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్... బైక్ అద్దెకు తీసుకోవచ్చు
Sabarimala Bike Rent: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్... బైక్ అద్దెకు తీసుకోవచ్చు (image: Cafe Rides)
  • Share this:
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు శుభవార్త. ప్రయాణంలో మీరు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. మీరు చెంగన్నూర్ రైల్వే స్టేషన్ నుంచి పంబ వరకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌పై వెళ్లొచ్చు. కొచ్చికి చెందిన బైక్ రెంటింగ్ సంస్థ కేఫ్ రైడ్స్ త్రివేండ్రం రైల్వే డివిజన్‌తో కలిసి బైక్ సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. శబరిమల వచ్చే అయ్యప్ప భక్తుల కోసం 10 బుల్లెట్స్‌ని అందుబాటులో ఉంచింది. చెంగన్నూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న భక్తులు బైక్ కియోస్క్‌కు వెళ్లి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ బుక్ చేసుకోవచ్చు. 24 గంటల్లో 200 కిలోమీటర్లకు రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతీ కిలోమీటర్‌కు రూ.6 చొప్పున, ప్రతీ అదనపు గంటకు రూ.100 చొప్పున చెల్లించాలి. బైక్ నడిపేవారు డ్రైవింగ్ లైసెన్స్ డిజిటల్ కాపీతో పాటు అడ్రస్ ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలి. భక్తులకు బైక్‌తో పాటు హెల్మెట్ కూడా అందిస్తుంది ఈ సంస్థ.

కేఫ్ రైడ్స్ ప్రారంభించిన బుల్లెట్ రెంట్ సర్వీస్‌కు మంచి స్పందన వస్తోంది. బైక్ బుకింగ్‌కు ఆన్‌లైన్ సర్వీస్ ఇంకా ప్రారంభం కాలేదు. వెబ్‌సైట్‌లో కొన్ని మార్పులు చేసిన తర్వాత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తామని కేఫ్ రైడ్స్ ఓనర్ సనీల్ రాజప్పన్ తెలిపారు. వచ్చే సీజన్ నాటికి పంబలో పార్కింగ్ లాట్ ఏర్పాటు చేస్తామని చెప్పారాయన. 2017 నుంచి శబరిమల భక్తులకు ఎడప్పలి షోరూమ్ నుంచి బైక్ రెంట్ సేవల్ని అందిస్తోంది. ప్రతీ సీజన్‌లో కనీసం 50 రైడ్స్ వచ్చేవి. ఈసారి చెంగన్నూర్ రైల్వే స్టేషన్ నుంచి ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ఇక ఇదే కాకుండా త్వరలో రెంట్ ఎ కార్ సదుపాయాన్ని కూడా ప్రారంభించే ఆలోచనలో ఉంది సదరన్ రైల్వే.

Vivo S1: వివో ఎస్1 ధర తగ్గింది... ఫోన్ ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

Sabarimala: శబరిమల వెళ్తున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

Sabarimala: శబరిమల వెళ్తున్నారా? ఆర్జిత సేవలకు ఎంత చెల్లించాలో తెలుసా?Sabarimala Special Trains: తెలంగాణ, ఏపీ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్ల వివరాలు, టైమింగ్స్ ఇవే
First published: December 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>