పాఠశాలలు, ఆసుపత్రుల్లో అమలు చేసినట్లే రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డుల్లో కూడా నాడు - నేడు కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కన్నబాబు ప్రకటించారు. డిసెంబర్ 15 వరకు కౌలు రైతు వివరాలు సేకరించి… వారికి రైతు భరోసా సొమ్ము అందజేయనున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటి వరకు 45 లక్షల కుటుంబాలు రైతు భరోసా ద్వారా లబ్ది పొందాయని ఆయన తెలిపారు. గతంలో ఏర్పాటు అయిన జాయింట్ ఫార్మింగ్ సంఘాలు.. రైతు భరోసా పరిధిలోకి వస్తాయో లేదో స్పష్టం చేయాలని సీఎం జగన్ ఆదేశించారని కన్నబాబు తెలిపారు. జనవరి 1 నుంచి అగ్రి ఇన్పుట్ దుకాణాలు ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ప్రతి మండలం, నియోజకవర్గంలో కూడా గోదాములు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు. చిరు ధాన్యాలకు కూడా మద్దతు ధర నిర్ణయించాలని సీఎం జగన్ ఆదేశించారని వివరించారు. ప్రతి నియోజకవర్గానికి మార్కెట్ కమిటీ ఉండేలా పునర్ వ్యవస్థీకరణ చేస్తున్నట్లు కన్నబాబు వివరించారు. ఈ నేపథ్యంలో 207 కొత్త మార్కెట్ కమిటీలు రానున్నాయని కన్నబాబు అన్నారు. రైతు బజార్లను బలోపేతం చేయడంతో పాటు మరొ 56 కొత్త రైతు బజార్లు ఏర్పాటు చేయాలని కూడా సీఎం వైయస్ జగన్ ఆదేశించారని మంత్రి కన్నబాబు తెలిపారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.