సీఎం జగన్‌కు ఫేవరెట్ హీరో బాలయ్య సలహా...

‘తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దేశ భాషలందు తెలుగు లెస్స అని మన ప్రాంతం కానివాళ్లు కూడా ఎందరో ప్రశంసించారు.’ అని బాలకృష్ణ అన్నారు.

news18-telugu
Updated: December 14, 2019, 10:23 PM IST
సీఎం జగన్‌కు ఫేవరెట్ హీరో బాలయ్య సలహా...
నందమూరి బాలకృష్ణ, వైఎస్ జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన ఫేవరెట్ హీరో నందమూరి బాలకృష్ణ సలహా ఇచ్చారు. అయితే, డైరెక్ట్‌గా చెప్పకుండా పరోక్షంగా చెప్పారు. తెలుగు భాష విషయంలో బాలయ్య.. సీఎం జగన్‌కు సలహా ఇచ్చారు. తెలుగు భాష అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం అందరి మీదా ఉందన్నారు. ఈ విషయాన్ని గుర్తు చేసిన అంబికా కృష్ణకు బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ‘తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దేశ భాషలందు తెలుగు లెస్స అని మన భాష వారు, మన ప్రాంతం వారే కాదు. మన ప్రాంతం కానివాళ్లు కూడా ఎందరో ప్రశంసించారు.’ అని బాలకృష్ణ అన్నారు. తాను భాష అంటే చెవికోసుకుంటానని చెప్పారు. బాలకృష్ణ హీరోగా నటించిన రూలర్ సినిమా ఈనెల 20న రిలీజ్ కానుంది. సమాజంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలను బాలకృష్ణ ఖండించారు. రూలర్ సినిమాలో తన గెటప్ చూసి చాలా మంది గ్రాఫిక్స్ అనుకున్నారని, బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నానని కూడా చాలా మంది అనుకున్నారని బాలయ్య చెప్పారు. అయితే, సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డానని చెప్పారు.

First published: December 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు