కాకినాడ తుని జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఆ బస్సు విజయవాడ నుంచి పార్వతీపురం వెళ్తోంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. వారిలో కొందరికి గాయాలైనట్లు సమాచారం.
అసలు ఈ బస్సు ప్రమాదం జరగడానికి కారణం డ్రైవరే అని తెలిసింది. నిద్ర మత్తులో బస్సు నడిపిన డ్రైవర్.. వేగంగా నడుపుతూ.. డివైడర్‌ని ఢీకొట్టడంతో.. ఒక్కసారిగా బస్సు.. అదుపు తప్పి.. బోల్తాకొట్టి.. రోడ్డుపైనే పడింది. ఆ సమయంలో ప్రయాణికులు కూడా నిద్రమత్తులో ఉన్నారని తెలిసింది.
జనరల్‌గా ఆర్టీసీ బస్సు డ్రైవర్లు బాగానే నిద్రపోతారు. అందువల్ల డ్రైవింగ్ చేసే సమయంలో వారికి నిద్ర రాదు. కానీ ఈ డ్రైవర్‌కి నిద్ర రావడానికి కారణం.. వాతావరణంలో వచ్చిన మార్పే అని తెలుస్తోంది. చల్లటి వాతావరణం కారణంగా... డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Road accident