మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మరో షాక్

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఆర్టీఏ అధికారులు మరో షాక్ ఇచ్చారు.

news18-telugu
Updated: November 14, 2019, 3:33 PM IST
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మరో షాక్
జేసీ దివాకర్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి మరో షాక్‌ తగిలింది. దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన మరికొన్ని బస్సులను అధికారులు సీజ్ చేశారు. రవాణా శాఖ అధికారులు గురువారం జరిపిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని ఆరు జేసీ ట్రావెల్స్ బస్సులు పట్టుబడ్డాయి. సరైన రికార్టులు లేకపోవడంతో అధికారులు ఈ బస్సులను సీజ్ చేశారు. గడిచిన పది రోజుల్లో జేసీకి చెందిన ట్రావెల్స్‌ను సీజ్‌ చేయడం ఇది రెండో సారి కావడం గమనార్హం. ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియర్ పర్మిట్లలో అక్రమాలు కారణంగా ఇటీవల 36 బస్సులు.. 18 కాంట్రాక్టు బస్సులను అధికారులు సీజ్ చేసి కేసులు నమోదు చేశారు.

వారం క్రితం జేసీ దివాకర్ రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం జగన్ కొందరిని టార్గెట్ చేస్తున్నారని జేసీ మండిపడ్డారు. దివాకర్ ట్రావెల్స్ బస్సులను సీజ్‌పై జేసీ దివాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన హద్దు మీరి పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ట్రాన్స్‌పోర్టులో తమకు 74 ఏళ్ల అనుభవం ఉందని అన్నారు. ఇప్పటివరకు తమ సంస్థకు చెందిన 80 బస్సులు సీజ్ చేశారని జేసీ దివాకర్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. బస్సు టైమింగ్ రాలేదని సీజ్ చేస్తున్నారని..... ఇదెక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు. తాజాగా మరోసారి దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులను అధికారులు సీజ్ చేయడంతో... దీనిపై జేసీ దివాకర్ రెడ్డి ఏ రకంగా స్పందిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.


First published: November 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు