హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan: చిక్కుల్లో పవన్ కల్యాణ్ 'వారాహి' వాహనం.. ఆ ఇబ్బందులు తప్పవా?

Pawan Kalyan: చిక్కుల్లో పవన్ కల్యాణ్ 'వారాహి' వాహనం.. ఆ ఇబ్బందులు తప్పవా?

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కోసం ముచ్చటపడి చేయించుకున్న బస్సు వారాహి చిక్కుల్లో పడింది. అయితే ఈ వాహనానికి వేసిన రంగు మిలట్రీ వాహనాల మాదిరి ఉంది. ఆలివ్ గ్రీన్ కలర్ మిలట్రీ వాహనాలకు మినహా మరే ఇతర వాహనాలకు అనుమతించరు. వారాహి చూడగానే యుద్ద వాహనంలా కనిపిస్తోంది. దీంతో వారాహి చిక్కుల్లో పడింది. అయితే వాహనం రంగు మారిస్తే మాత్రం ఇబ్బంది తొలగిపోవచ్చు. లేకపోతే వాహన రిజిస్ట్రేషన్ రద్దు చేసే అవకాశం ఉంది. ప్రత్యేకంగా ఎన్నికల ప్రచారానికి తయారు చేయించుకున్న వాహనానికి తెలంగాణ, ఏపీలో ఏదో ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయించి, నెంబరు కేటాయించాల్సి ఉంది. అయితే వాహనానికి వేసిన రంగు విషయంలో రవాణా శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అంతా ఓకే కాని రంగు మాత్రం మార్చాల్సిందే.

వారాహి వాహనాన్ని అన్ని హంగులతో తయారు చేయించారు. 360 డిగ్రీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాహనం కదిలినప్పటి నుంచి సీసీ కెమెరాల ద్వారా రికార్డు అయ్యే వీడియోలు సర్వర్ కు వెళతాయి. ఇక లైటింగ్, సౌండ్ సిస్టమ్ కూడా ప్రత్యేకంగా తయారు చేయించిన సంగతి తెలిసిందే. పవన్ మీటింగ్ ప్రారంభించగానే కరెంటు పోయే అవకాశాలు ఉన్నాయనే అనుమానంతో వాహనం నుంచి భారీ లైటింగ్ ఇచ్చే లైట్లను ఏర్పాటు  చేశారు. కొద్ది రోజుల క్రితం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఉన్న ఆలివ్ గ్రీన్ రంగు ఉన్న వాహనాలు అన్నింటికీ కలర్ మార్చుకోవాలని లేకపోతే రిజిస్ట్రేషన్ రద్దు అవుతుందని హెచ్చరించింది. మోటార్ వాహనాల చట్టం ప్రకారం మిలట్రీ వాహనాల రంగును, ప్రైవేట్ వాహనాలకు వాడటానికి అనుమతించరు. దీంతో పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో దీని రంగు మార్చాల్సి ఉంది. వాహనం రంగు మార్చాల్సి వస్తే జనసేన పార్టీ కలర్ వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

వాహనాలకు మన ఇష్టం వచ్చిన రంగులు వేసుకుంటామంటే కుదరదు. ఒక్కో వాహనానికి కొన్ని కలర్స్ మాత్రమే అనుమతిస్తారు. ఉదాహరణకు అంబులెన్స్ కు తెలుపు రంగు, ఎర్రబుగ్గ అనుమతిస్తారు. ఇతర వాహనాలకు ఏ రంగైనా వేసుకోవచ్చు. కాని ఆలివ్ గ్రీన్ మాత్రం అనుమతించరు. ఎందుకంటే మిలట్రీలో యుద్ధ వాహనాల కోసం ఆ రంగును ప్రత్యేకంగా ఉపయోగిస్తున్నారు. అందువల్ల ఇతర వాహనాలకు ఆలివ్ గ్రీన్ అనుమతించరు. జనసేనాని ఆలోచనలకు అనుగుణంగా ఎన్నికల యుద్ధ కోసం అన్నట్లు ఈ కలర్ ఎంచుకొన్నట్లు కనిపిస్తోంది. jelw మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఈ రంగును ప్రైవేట్ వాహనాలకు వాడటానికి అనుమతించే అవకాశాలు ఏ మాత్రం లేవు. వాహనం డిజైన్ అయితే ఓకే కాని, రంగు మాత్రం ఖచ్చితంగా మార్చాల్సి ఉంటుంది.

First published:

ఉత్తమ కథలు