సీఎం జగన్‌ను కలిసిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్..ఎందుకంటే?

కడప స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్‌ను కలిసిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం ఇప్పుడు...ఇప్పుడు మరోసారి సీఎం జగన్‌ను కలిశారు. ఎందుకంటే..?

news18-telugu
Updated: January 27, 2020, 11:59 AM IST
సీఎం జగన్‌ను కలిసిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్..ఎందుకంటే?
ఫైల్ ఫోటో
  • Share this:
అసెంబ్లీ లాబీలోని సీఎం ఛాంబర్‌లో ఏపీ సీఎం జగన్‌ను బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఏపీ కలిశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్‌ను కలిశారు. త్వరలో జరగనున్న తన కుమారుడు వివాహానికి రావాలని సీఎంను ఆహ్వానించారు.  ఇటీవల జరిగిన  కడప స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ సీఎం జగన్‌ను సీఎం రమేశ్ కలిశారు. ఇప్పుడు మరోసారి ఆయన సీఎం జగన్‌ను కలవడం  రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే సీఎంను సీఎం రమేశ్ కలవడంలో ఎలాంటి రాజకీయం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

First published: January 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు