ముళ్ల పొదల్లో రూ.5లక్షల మద్యం.. తెలంగాణ టూ ఏపీ

తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చి ముళ్ల పొదళ్లో నిల్వఉంచారు. మద్యం అక్రమంగా తరలించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

news18-telugu
Updated: May 26, 2020, 8:45 PM IST
ముళ్ల పొదల్లో రూ.5లక్షల మద్యం.. తెలంగాణ టూ ఏపీ
పట్టుబడిన అక్రమ మద్యం
  • Share this:
తెలంగాణ నుంచి ఏపీకి అక్రమ మద్యం ఏరులై పారుతోంది. ఏపీలో అధిక ధరలు ఉండడం, మంచి బ్రాండ్ లభ్యం కాకపోవడంతో.. తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున మద్యం తరలివెళ్తోంది. చెక్‌పోస్టుల్లో పోలీసులు, ఎక్సైజ్ అధికారుల కళ్లు గప్పి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో గుంటూరులో పెద్ద మొత్తంలో మద్య పట్టుబడింది. దాచేపల్లి మండలం పెదగార్లపాడు- చినగార్లపాడు గ్రామాల మధ్య ముళ్లపొదల్లో సుమారు రూ.5 లక్షల విలువైన 1600 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చి ముళ్ల పొదళ్లో నిల్వఉంచారు. మద్యం అక్రమంగా తరలించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీని వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై ఆరాతీస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: May 26, 2020, 8:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading