తిరుమల వెంకన్నకు పంగనామాలు.. టీటీడీలో భారీ స్కాం?

రికార్డులను పరిశీలించేందుకు ఏపీభవన్‌కు వెళ్లిన టీటీడీ విజిలెన్స్ అధికారులు అక్కడి రెసిడెంట్ కమిషనర్ వెనక్కు పంపించేసినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

news18-telugu
Updated: August 23, 2019, 5:30 PM IST
తిరుమల వెంకన్నకు పంగనామాలు.. టీటీడీలో భారీ స్కాం?
తిరుమల బ్రహ్మోత్సవాలు
  • Share this:
తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. తిరుమల శ్రీవారి పేరుతో కొందరు అధికారులు, సిబ్బంది కలసి రూ.5కోట్ల మేర కుంభకోణానికి పాల్పడినట్టు సమాచారం. శ్రీవేంకటేశ్వరస్వామి వారికి తిరుమలలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. టీటీడీ తరఫున ఈ వేడుకలు నిర్వహిస్తారు. ఢిల్లీలో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో అవకతవకలు జరిగినట్టు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా రూ.5కోట్లను ఖర్చు చేసినట్టు టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. స్థానిక లోకల్ అడ్వైజరీ కమిటీ మీద ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై విచారణ జరపాల్సిందిగా టీటీడీ విజిలెన్స్ అధికారులను చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు. ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులు ఢిల్లీ వెళ్లి విచారణ జరిపారు. ఖర్చులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. కొన్ని రికార్డుల గురించి విజిలెన్స్ అధికారులు ప్రశ్నించగా, అవన్నీ ఏపీ భవన్‌లో ఉన్నాయని, అంతర్గతంగా ఆడిట్ జరుగుతోందని స్థానిక సిబ్బంది సమాచారం ఇచ్చారు. ఆ రికార్డులను పరిశీలించేందుకు ఏపీభవన్‌కు వెళ్లిన టీటీడీ విజిలెన్స్ అధికారులు అక్కడి రెసిడెంట్ కమిషనర్ వెనక్కు పంపించేసినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తిరుమలతో పాటు దేశంలోని పలు చోట్ల టీటీడీ ఆలయాలు ఉన్నాయి. చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, పాండిచ్చేరి సహా పలుచోట్ల దేవాలయాలను టీటీడీ పర్యవేక్షిస్తోంది. స్థానికంగా ఉండే సలహా మండలి సూచనలతో ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. అయితే, ఖర్చుకు సంబంధించి రూ.5లక్షల వరకు వారికి అధికారాలు ఉంటాయి. అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టాలంటే, టీటీడీలో ఆర్థిక విభాగం నుంచి అనుమతి తీసుకోవాలి.

First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు