తెలుగు రాష్ట్రాల ఐటీ దాడుల్లో రూ.2000 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు...

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరిపిన ఆదాయపన్ను శాఖ దాడుల్లో రూ.2000 కోట్ల విలువైన ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించినట్టు ఐటీ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.

news18-telugu
Updated: February 13, 2020, 8:50 PM IST
తెలుగు రాష్ట్రాల ఐటీ దాడుల్లో రూ.2000 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరిపిన ఆదాయపన్ను శాఖ దాడుల్లో రూ.2000 కోట్ల విలువైన ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించినట్టు ఐటీ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరిపిన ఆదాయపన్ను శాఖ దాడుల్లో రూ.2000 కోట్ల విలువైన ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించినట్టు ఐటీ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ‘2020 సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఆదాయ పన్ను శాఖ హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్నం, ఢిల్లీ, పుణెల్లో సోదాలు జరిపింది. మొత్తం 40 చోట్ల ఐటీ సోదాలు జరిగాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని మూడు ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఉన్నాయి. అధిక బిల్లులు, బోగస్ బిల్లులతో బోగస్ సబ్ కాంట్రాక్టుల ద్వారా భారీ ఎత్తున నగదు లావాదేవీలు జరిపిన రాకెట్ గుట్టు రట్టయింది. ఓ ప్రముఖుడికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి మీద కూడా ఐటీ దాడులు జరిగాయి. ఆ పర్సన్‌కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు లభ్యమయ్యాయి.’ అని ఆ ప్రకటనలో పేర్కొంది.

ఆదాయపన్ను శాఖ జారీ చేసిన పత్రికా ప్రకటన


ఆ ఇన్ ఫ్రా కంపెనీలు కొన్ని పనులను ఇతర కంపెనీలకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు చూపించాయని, అయితే, అసలు ఆ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిన కంపెనీలే లేవని, లేకపోతే బోగస్ సంస్థలుగా రిపోర్టులో తేలినట్టు ఐటీశాఖ తెలిపింది. ఇప్పటి వరకు లభించిన ఆధారాలను పరిశీలిస్తే ప్రాథమికంగా సుమారు రూ.2000 కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించింది. వేసిన బిల్లులనే మళ్లీ మళ్లీ వేస్తూ, రూ.2కోట్ల కంటే తక్కువ పనులుగా చూపిస్తూ (బిల్లు పుస్తకాలు అవసరం లేని విధంగా, ఆడిటింగ్ నుంచి తప్పించుకోవడానికి)అక్రమాలకు పాల్పడినట్టు అనుమానం వ్యక్తం చేసింది. అయితే, ఆ పుస్తకాల్లో చేసిన ఎంట్రీల్లోని కంపెనీలను పరిశీలిస్తే... అసలు ఆ కంపెనీలు పేర్కొన్న అడ్రస్‌లో లేవని, ఉన్నా అవి డొల్ల కంపెనీలు అనే నిర్ధారణకు వచ్చింది.

ఎఫ్‌డీఐ పేరుతో నిధులను సొంత కంపెనీలకు తరలించినట్టు ఆదాయపన్ను శాఖ గుర్తించింది. ఈ తనిఖీల సందర్భంగా రూ.85లక్షల నగదు, రూ.75 లక్షల విలువైన బంగారం, 25 బ్యాంక్ లాకర్లు సీజ్ చేసినట్టు ఐటీ శాఖ జారీ చేసిన ప్రకటనలో పేర్కొంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: February 13, 2020, 7:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading