RS 10000 FINANCIAL ASSISTANCE FOR AUTO DRIVERS IN ANDHRA PRADESH ONLINE APPLICATION PROCESS STARTS ON SEPTEMBER 12 SS
Good News: ఆటో డ్రైవర్లకు రూ.10,000 సాయం... సెప్టెంబర్ 12 నుంచి దరఖాస్తులు
ప్రతీకాత్మక చిత్రం
Rs 10,000 for Auto Drivers | ఆమోదం పొందిన తర్వాత గ్రామ వాలంటీర్ లేదా వార్డు వాలంటీర్ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మరీ రూ.10,000 ఆర్థిక సాయం, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందేశంతో కూడిన పత్రాని అందజేస్తారు.
ఆటో డ్రైవర్లకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్‌లోని ఆటో డ్రైవర్లకు ఏటా రూ.10,000 ఆర్థిక సాయాన్ని అందించేందుకు ఆన్లైన్లో సెప్టెంబర్ 12న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుందని రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి తిరుమల కృష్ణబాబు తెలిపారు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలు ఖరారయ్యాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు ప్రతీ ఏటా రూ.10,000 ఆర్థిక సాయాన్ని ఇస్తామని పాదయాత్ర సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీని నెరవేర్చేందుకు ఆటో డ్రైవర్ల నుంచి దరఖాస్తుల్ని స్వీకరించనుంది ఏపీ ప్రభుత్వం. ఇందుకోసం రవాణా శాఖ ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి గ్రామ వాలంటీర్ లేదా వార్డ్ వాలంటీర్ ఆటో డ్రైవర్లకు సాయంగా ఉంటారు. వారి సాయంతో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపీడీఓ పర్యవేక్షణలో దరఖాస్తుల పరిశీలన తర్వాత కలెక్టర్ అనుమతితో CFMS డేటాబేస్ పోర్టల్‌లో వివరాలను అప్లోడ్ చేస్తారు. బిల్లుకు ఆమోదం పొందిన తర్వాత గ్రామ వాలంటీర్ లేదా వార్డు వాలంటీర్ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మరీ రూ.10,000 ఆర్థిక సాయం, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందేశంతో కూడిన పత్రాని అందజేస్తారు.
ఆటో డ్రైవర్లు రూ.10,000 ఆర్థిక సాయం పొందేందుకు అర్హతలివే...
ఆటో రిక్షా, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ వీటిలో ఏదైనా సొంత వాహనమై ఉండాలి. ఓనరే ఆటోను నడుపుతూ ఉండాలి.
ఆ వాహనానికి ఆటో రిక్షా లేదా లైట్ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.
వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు (రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ట్యాక్స్ రిసిప్టులు) సరిగ్గా ఉండాలి.
దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారే అర్హులు.
ఆటో డ్రైవర్‌కు ఆధార్ కార్డు తప్పనిసరి.
ఆధార్ నెంబర్‌ను వెహికిల్, లైసెన్స్‌తో లింక్ చేయాలి.
ఒక వ్యక్తి ఒక వాహనానికి మాత్రమే ఆర్థిక సాయాన్ని పొందేందుకు అర్హులు.
రెండు ఆటోలు ఉన్నా ఒకే సాయం అందుతుంది.
ఒక ఇంట్లో వేర్వేరు పేర్ల మీద రెండు ఆటోలు ఉన్నా ఒకే సాయం అందుతుంది.
Photos: రిలయెన్స్ ట్రెండ్స్ ప్రారంభోత్సవంలో రకుల్ ప్రీత్ సింగ్ సందడి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.