ఏపీలో చిన్న ఇంటికి రూ.1.49 లక్షల కరెంటు బిల్లు

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఓ పూరిగుడిసె ఇంటికి నెలకు రూ.1.49 లక్షల కరెంటు బిల్లు వచ్చింది. అనంతపురం జిల్లా కనేకల్‌లో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన కె. నాగమ్మ రోజు కూలీ. ఆమెకు ఓ చిన్న ఇల్లు ఉంది.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఓ పూరిగుడిసె ఇంటికి నెలకు రూ.1.49 లక్షల కరెంటు బిల్లు వచ్చింది. అనంతపురం జిల్లా కనేకల్‌లో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన కె. నాగమ్మ రోజు కూలీ. ఆమెకు ఓ చిన్న ఇల్లు ఉంది. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ పక్కనే ఆమె ఇల్లు ఉంటుంది. ఆ ఇంటికి ఏకంగా రూ.1,49,034 కరెంటు బిల్లు వచ్చింది. ఆ ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ వస్తువులు ఏంటంటే, ఓ ఫ్యాన్, ఓ టీవీ, ఓ ట్యూబ్ లైట్. ఈ మూడింటికే లక్షన్నర కరెంటు బిల్లు వచ్చింది. సహజంగా ఆమె నివసించే ఇంటికి నెలకు రూ.100 లోపే కరెంటు బిల్లు వస్తుంది. ఆమెకు వచ్చిన కరెంటు బిల్లును పరిశీలిస్తే అందులో రూ.50 కనీస చార్జీలు, రూ.25 కస్టమర్ చార్జీలు, రూ.25 లేట్ ఫీజు సర్ చార్జి ఉంది. అయితే, ఏప్రిల్ నెల నుంచి డిసెంబర్ వరకు పెండింగ్ బిల్లు కింద రూ.1,48,934 బిల్లు వేశారు. కరోనా కారణంగా ఉపాధి లేక, ఒకవేళ తాను ఏడు నెలలుగా కరెంటు బిల్లు కట్టకపోతే రూ.700 రావాలి. జరిమానా వేస్తే మొత్తం కలిపి రూ.1000 రావొచ్చు. అంతే కానీ, ఇలా రూ.లక్షన్నర ఎలా వస్తుందని ఆమె వాపోయింది.

  ఈ విషయంపై ఏపీ ట్రాన్స్‌కో అసిస్టెంట్ ఇంజినీర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బిల్లింగ్ విషయంలో టెక్నికల్ సమస్య వల్ల ఇలా అధిక బిల్లు వచ్చిందని తెలిపారు. ‘మేం దీన్న పరిష్కరిస్తాం. ఒకసారి ఆమె ఆ కరెంటు బిల్లు మా దగ్గరకు తీసుకొస్తే చాలు. ఒకసారి ఆ మేటర్ సెటిల్ అయిన తర్వాత ఆమెకు మామూలుగానే కరెంటు బిల్లు వస్తుంది. ’ అని చెప్పారు.

  ఈ ఏడాది జూలైలో హైదరాబాద్‌లో ఓ వినియోగదారుడికి ఏకంగా రూ.25 లక్షల కరెంట్ బిల్లు బిల్లు వచ్చింది. ఆ బిల్లు చూసి ఇంటి యజమానికి గుండె ఆగినంత పనయింది. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేయగా.. వారు కూడా షాక్ తిన్నారు. హైదరాబాద్‌లో లాలాపేట పరిధిలో నివాసముండే ఓ వ్యక్తికి సాధారణంగా నెలకు రూ. 500-600 కరెంట్ బిల్లు వస్తుంది. ఇక వేసవిలో అయితే రూ.800 వరకు వస్తుంది. ఐతే లాక్‌డౌన్ కారణంగా మూడు నెలలు బిల్లు తీయలేదు. అన్నీ కలిపి బిల్లు ఇచ్చారు. మార్చి 6 నుంచి జులై 6 వరకు బిల్లు తీశారు. ఈ నాలుగు నెలల్లో 3,45,007 యూనిట్లు విద్యుత్ వాడినట్లు చూపించి.. ఏకంగా రూ. 25,11,467 బిల్లు వేశారు. సదరు వినియోగదారుడి ఫిర్యాదుతో స్పందించిన అధికారులు.. సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగి ఉంటుందని చెప్పారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: