Home /News /andhra-pradesh /

RRR THEATER ONE FAN GAVE STILLS WITH A GUN IN EAST GODAVARAI DISTRICT POLICE FILED A CASE NGS

RRR Movie: ఏపీలో నయా కల్చర్ అభిమానులు హడల్.. ఆర్ఆర్ఆర్ థియేటర్ దగ్గర గన్ తో ఫ్యాన్ హంగామా..? ఏం జరిగిందంటే?

ఆర్ఆర్ఆర్ థియేటర్ దగ్గర గన్ తో హల్ చల్

ఆర్ఆర్ఆర్ థియేటర్ దగ్గర గన్ తో హల్ చల్

RRR Movie: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూసిన ఆర్ఆర్ఆర్ సినిమాఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతేకాదు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో.. ఫ్యాన్స్ అయితే బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఇదే సమయంలో కొందరు అభిమానులు అతి చేసి.. హైలెట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.. కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారు.

ఇంకా చదవండి ...
    RRR Movie: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది చాలా ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా ఆర్ఆర్ఆర్. అంచనాలకు తగ్గట్టే తొలి రోజే రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. టికెట్ ధర ఎంతైనా.. అభిమానులు తగ్గేదేలే అంటూ సినిమా చూడడానికి పోటీ పడ్డారు. ముందుగానే టికెట్లు బుక్ అయిపోవడంతో చాలా చోట్ల భారీగా బ్లాక్ టికెట్ల దందా కూడా నడిచింది. అయినా తొలి రోజే ఈ సినిమా చూసేయాలనే ఆసక్తితో కొందరు ఎంత ఖర్చు పెట్టడానికైనా అభిమానులు వెనుకాడలేదు. కేవలం నందమూరి (Nanadamuri), మెగా (Mega) అభిమానులు (Fance) .. ఇతర హీరోల అభిమానులే కాదు.. సామన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అంతా ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి కనబరుస్తూనే ఉన్నారు. దీంతో ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ సినిమా మేనియా కనిపిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల హంగామాకు హద్దే లేకుండా పోయింది. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ramcharan) హీరోలుగా రూపొందిన ఈ సినిమాతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా మానియా కొనసాగుతుంది. ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా రౌద్రం రణం రుధిరం మాటే వినిపిస్తోంది. మెగా, నందమూరి ఫ్యాన్స్ (Mega, Nandmuri) హంగామా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. సాధారణంగానే ఫేవరేట్‌ హిరో సినిమా రిలీజ్‌ అయితే, పాలాభిషేకాలు, పూలమాలలు కామన్. కానీ ఓ వ్యక్తి గన్ తో థియేటర్ దగ్గర హల్ చల్ చేసి.. వార్తల్లో నిలిచాడు..

    ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయిన థియేటర్ దగ్గర కాసుపే ఓ అభిమాని హల్ చల్ చేశాడు. అతడి అభిమానం హద్దులు దాటాయి. తూర్పు గోదావరి జిల్లా (East Godavari District)లోని ట్రిపుల్ ఆర్ థియేటర్ దగ్గర నయా కల్చర్‌ తెరపైకి వచ్చింది. జిల్లాలోని పిఠాపురంలో శ్రీ అన్నపూర్ణా థియేటర్ లో ట్రిపుల్ ఆర్ సినిమా హౌస్ ఫుల్ గా కోనసాగుతోంది. అయితే థియేటర్ దగ్గర ఓ అభిమాని గన్ తో హల్చల్ చేశాడు. ముందు సినిమా ధియేటర్ బయట గన్ తో ఫోజులిచ్చాడు. అక్కడితోనే అతడి ఉత్సాహం ఆగలేదు. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రదర్శిస్తున్న సమయంలో సినిమా ధియేటర్ లోని తెరముందు గన్ తో తిరుగుతూ కెరింతలు కొట్టాడు.




    అలా గన్ తో హీరోలకు ఫోజులిచ్చి అతడు ఆనందం పొందాడు కాని.. అతడి చూసిన సామాన్య ప్రేక్షకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ యువకుడి చేతిలో ఉన్న తుపాకీ నిజమైందా లేక డమ్మినా తెలియక అభిమానులు భయంతో సినిమా చూడాల్సి వచ్చింది. అసలు థియేటర్ లోకి గన్ తో ఎలా వచ్చాడో తెలియన.. దాంతో ఏ చేయబోతున్నాడో అంటూ తీవ్ర ఆందోళనలకు గురయ్యారు.

    ఇదీ చదవండి : పేద ప్రజలకు వెల్ ఫేర్.. చంద్రాబుకు ఫేర్ వెల్.. సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను విడుదల చేసిన సీఎం

    ఆ యువకుడ్ని పిఠాపురం చెందిన వ్యక్తి హసామిగా స్థానికులు చెబుతున్నారు. ఆ యువకుడు గన్..తో 1 బులెట్ కూడా కాల్చాడు.. ఆలస్యంగా ఆ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు.. ఆ వ్యక్తిపై చర్యలు సిద్ధమైనట్టు సమాచారం. అసలు గన్ ఎలా అక్కడి తీసుకొచ్చాడు.. ఆ గన్ ఎవరిది.. లైసెన్స్ ఉందా.. థియేటర్ దగ్గరకు ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది అన్న కోణాల్లో విచారణ చేస్తున్నట్టు సమాచారం.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, East Godavari Dist, RRR, RRR Movie Review

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు