RRR Mania: కేవలం తెలుగు రాష్ట్రాలు, యావత్ భారత దేశమే కాదు.. ప్రపంచంలో చాలా దేశాలు ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా (RRR Movie) కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఆ సమయం ఆసన్నమవుతోంది. మరో మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ అవుతోంది. ఎప్పటి నుంచో మెగా, నందమూరి అభిమానులు ఈ సినిమా కోసమే ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ కు సిద్ధం అవ్వడంతో.. తమ అభిమాన హీరోలకు వినూత్న రీతుల్లో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కేవలం అభిమానులే కాదు.. వ్యాపారులు కూడా ఆర్ఆర్ఆర్ క్రేజ్ ను వాడేసుకుంటున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఓ గ్యాస్ ఏజెన్సీ అయితే.. తమ దగ్గర ఎవరైనా సింగిల్ గ్యాస్ సిలిండెర ను డబుల్ సిలిండెర్ చేసుకుంటే.. సినిమా టికెట్లు ఉచితంగా ఇస్తామంటూ సరికొత్త ఆఫర్ ప్రకటిస్తూ బ్యానెర్లు కట్టింది. ఇలా ఎవరికి వారు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ramcharan) క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారు. వ్యాపారుల సంగతి ఎలా ఉన్న.. అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. వినూత్న రీతుల్లో తమ అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ సరికొత్త ప్రయోగం చేశాడు.
చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం చిన్నపర్తికుంటకు చెందిన పురుషోత్తం అనే యువకుడికి.. ఎప్పుడు వినూత్నంగా ఆలోచించడం అలవాటు. ఆ అలవాటుతో చిన్నప్పటి నుంచి ఎన్నో అద్బుతమైన బొమ్మలు వేసేవాడు.. చాలా వినూత్నంగా ఆలోచించి.. ఉప్పుతో బొమ్మలు వేసేవాడు. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో.. అందులో నటించిన ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలను టీ కప్పులతో వేయాలని ఆలోచించాడు. అది కూడా ఇద్దరివి వేర్వేరుగా బొమ్మలు వేయడం కాదు.. ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూపించే ప్రయత్నం చేశాడు. దానికి కోసం తీవ్రంగా శ్రమించాడు.
RRR Mania || అభిమానం అంటే ఇదే|| టీ కప్పులతో అద్భుతం ||ఒకే ఫ్రేమ్ లో జూని... https://t.co/ir4h25s0Rs via @YouTube #RRRMoive #RRRMovieOnMarch25th #RRROnMarch25th #JrNTR #RamCharan #NTRRR #RamCharanBdayCDP
— nagesh paina (@PainaNagesh) March 22, 2022
ఈ అద్భుతమైన ఫ్రేమ్ ను తయారు చేయడానికి పురుషోత్తం.. ఆరు రోజులు కష్టపడాల్సి వచ్చింది. 15వేల టీ కప్పులను ఒక్క దగ్గరకు చేర్చి.. వాటికి రంగులు అద్ధి.. ఎన్టీఆర్, రామ్‌చరణ్ చిత్రాలను రూపొందించి అద్బుతం అనిపించాడు. అమెరికాలోనూ ఆర్.ఆర్.ఆర్ మేనియా కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు ఈ మూవీ కోసం నానా హంగామా చేస్తున్నారు. తాజాగా కార్లతో జై ఎన్టీఆర్, ఆర్.ఆర్.ఆర్ అనే అక్షరాలను రూపొందించారు. దీని కోసం జూనియర్ ఫ్యాన్స్ ఎంత శ్రమపడ్డారు.
Houston #RamCharan fans celebrations #RRRmovie pic.twitter.com/OD84HP9z6w
— Sᴀɱ JօղVíƙ™ (@Sam_Jonvik2) March 21, 2022
ఇక ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన ఎన్టీఆర్ అభిమానులు 70 కార్ల ర్యాలీని ఏర్పాటు చేసి జై ఎన్టీఆర్, ఆర్.ఆర్.ఆర్ అని డ్రోన్ షాట్‌కు తగ్గట్లు ఒక చోట చేర్చి వీడియో తీశారు. ఇందుకోసం అభిమానులు భారీ ఖరీదైన కార్లను ఉపయోగించారు.
A huge 70+ car rally in Melbourne….Never before in Australia… it’s our love towards our demigod @tarak9999 Thanks @subhash551 for making this visual… fantastic brother…#RRR #NTR? @RRRMovie pic.twitter.com/jgEbofiAJQ
— Melbourne NTR fans (@MelbNTRFans) March 21, 2022
ఇటు మెగా అభిమానులు, అటు నందమూరి అభిమానులు సూపర్ అని పొడగ్తలు కురిపిస్తున్నారు. ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు తమ అభిమానాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.