హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Video: ఆ ప్రయాణికుడి అదృష్టం బాగుంది... విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ఎలా బతికిపోయాడో చూడండి

Video: ఆ ప్రయాణికుడి అదృష్టం బాగుంది... విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ఎలా బతికిపోయాడో చూడండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ఓ ప్రయాణికుడు రైలు ఎక్కబోతుండగా ప్రమాదం జరిగింది. ప్రయాణికుడిని కాపాడిన రైల్వే పోలీసులు ఆ వీడియోను రిలీజ్ చేశారు.

  రైలు ఎక్కబోయి ప్రమాదాలబారిన పడే ప్రయాణికులను రోజూ చూస్తూనే ఉంటాం. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించినప్పుడే ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇలాంటి ఘటన ఒకటి విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో జరిగింది. ఓ ప్రయాణికులు రన్నింగ్‌లో ఉన్న ట్రైన్ ఎక్కేందుకు పరిగెత్తాడు. ఫుట్‌బోర్డ్‌పై కాలు పెట్టి రైలు ఎక్కుతుండగా కాలు జారింది. ఈ దృశ్యాన్ని చూసిన 'మేరీ సహేలీ' టీమ్‌కు చెందిన ఆర్‌పీఎఫ్ వుమెన్ కానిస్టేబుల్ అక్కడే ఉన్న ఆర్‌పీఎఫ్ పోలీసులను అప్రమత్తం చేసింది. ఓ వుమెన్ కానిస్టేబుల్‌తో పాటు ఆర్‌పీఎఫ్ పోలీసులు ఆ ప్రయాణికుడిని ప్లాట్‌ఫామ్‌పైకి లాగేశారు. దీంతో ఆ ప్రయాణికుడికి ప్రమాదం తప్పింది. 'మేరీ సహేలీ' టీమ్‌కు చెందిన ఆర్‌పీఎఫ్ వుమెన్ కానిస్టేబుల్ యూనిఫామ్‌కు ధరించిన కెమెరాలో ఇదంతా రికార్డ్ అయింది. ఈ వీడియోని భారతీయ రైల్వే అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. వీడియో ఇక్కడ చూడొచ్చు.

  Indian Railways: ఇంత పొడవైన గూడ్స్ రైలు మీ జీవితంలో చూసి ఉండరు (Video)

  Indian Railways: రైలులో లోయర్ సైడ్ బెర్త్ మారిపోయింది ఇలా (Video)

  రైలు ఎక్కే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, కదిలే రైలు ఎక్కొద్దని, రైల్వే సిబ్బంది, రైల్వే పోలీసులు నిత్యం ప్రయాణికులను హెచ్చరిస్తూనే ఉంటారు. అయినా రైలు మిస్ అవుతుందన్న తొందరలో ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించి ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతుంటారు. ఇలాంటి ఘటనలు రైల్వే ప్లాట్‌ఫామ్‌లపై ఉండే సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుంటాయి. అయితే రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఉండే రైల్వే సిబ్బంది, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు ప్రయాణికులు ప్రమాదాలబారిన పడకుండా కాపాడిన సందర్భాలు అనేకం. తరచూ ఇలాంటి వీడియోలను రిలీజ్ చేస్తూ ప్రయాణికులను భారతీయ రైల్వే అప్రమత్తం చేస్తూనే ఉంటుంది. అయినా కొందరు ప్రయాణికులు మాత్రం అజాగ్రత్తగా ఉంటూ, తమ ప్రాణాలను రిస్కులో పెడుతుంటారు.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, AP News, Indian Railway, Indian Railways, Railways, Telugu news, Telugu updates, Telugu varthalu, Trending videos, Viral Video, Viral Videos, Visakha, Visakhapatnam

  ఉత్తమ కథలు