Home /News /andhra-pradesh /

ROYAL BENGAL TIGER CREATING MORE TROUBLES TO FOREST OFFICERS IN KAKINADA DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Tiger in Kakinada: చిక్కను దొరకను.. ముప్పతిప్పలు పెడుతున్న పులి.. ప్రస్తుతం ఎక్కడుందంటే..!

కాకినాడ జిల్లాలో పులి (ఫైల్)

కాకినాడ జిల్లాలో పులి (ఫైల్)

గత కొన్ని రోజులుగా కాకినాడ జిల్లా (Kakinada District) ప్రత్తిపాడు నియోజకవర్గంలో అదిగో పులి (Tiger).. ఇదిగో పులి అన్న మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అదిగో ఆ దారిలో నేను పులిని చూశానంటే.. ఇదిగో ఇటువైపు రోడ్డు దాటుతుంటే నేను చూశానంటూ మరో మాట వినిపిస్తోంది.

ఇంకా చదవండి ...
  గత కొన్ని రోజులుగా కాకినాడ జిల్లా (Kakinada District) ప్రత్తిపాడు నియోజకవర్గంలో అదిగో పులి (Tiger).. ఇదిగో పులి అన్న మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అదిగో ఆ దారిలో నేను పులిని చూశానంటే.. ఇదిగో ఇటువైపు రోడ్డు దాటుతుంటే నేను చూశానంటూ మరో మాట వినిపిస్తోంది. ఇంతకీ ఈ పులి చిక్కెదెప్పుడు..? చిక్కను దొరకను అన్నట్లు అటవీశాఖ అధికారులతో పులి దాగుడుమూతలు ఆడుతోంది. ప్రత్తిపాడు పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న పులిని పట్టుకునేందుకు అధికారులు బోనులు ఏర్పాటు చేశారు. వాటిని పసిగట్టిన పులి.. అటవీశాఖ అధికారులకు చిక్కకుండా తిరుగుతోంది. ఈ క్రమంలో అక్కడ నుంచి తప్పించుకుంటూ.., రౌతులపుడి నుంచి తుని (Tuni) మండలంలోకి అడుగుపెట్టింది. కుమ్మరిలోవ కాలనీ వద్ద రోడ్డు దాటుతుంటే స్థానికులు గుర్తించినట్లు తెలుస్తోంది. అదే ప్రాంతంలో కుమ్మరిలోవ నుంచి కొలిమేర వెళ్లే మార్గ మధ్యంలో అటవీశాఖ అధికారులు పులి పాదముద్రలు గుర్తించారు.

  రోజుకు 20 కిలోమీటర్ల ప్రయాణం
  ప్రత్తిపాడు నియోజకవర్గంలోని సమీప గ్రామాల్లో రోజుకు పది నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణిస్తోంది. పులి ప్రవర్తన అర్థంకాక అటవీశాఖ అధికారులు (Forest officers) తలలు పట్టుకొంటున్నారు. నిన్నమొన్నటివరకు దాదాపు 150 చదరపు కి.మీ. విస్తీర్ణంలో సంచరించిన పులి రౌతులపుడి ప్రజలను బెంబేలెత్తించింది. ఇప్పుడు ఆ పులి తుని మండలంలోకి ప్రవేశించడంతో అక్కడి ప్రజల్లో గుబులు మొదలైంది.

  ఇది చదవండి: ఏపీలో కొనసాగుతున్న సినిమా టికెట్ల రగడ.. థియేటర్ ఓనర్ల అభ్యంతరాలివే..!


  పులి తప్పించుకోడానికి అనువైన ప్రాంతం
  పులి ఇప్పటివరకు పదుల సంఖ్యలో పశువులను గాయపరిచి, వేటాడింది. పులికి అనువైన కొండలు, డొంకలు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటం వల్ల పులి ప్రజల కంట పడకుండా తప్పించుకుని తిరుగుతుంది. అయితే పులి వచ్చిన దారిలో వెళ్లేందుకు వర్షాల కారణంగా కొంత తడబడుతుందేమో అని అధికారులు యోచిస్తున్నారు.

  ఇది చదవండి: అన్నిదేశాల చేపలు ఒకే చోట.. ఔరా అనిపిస్తున్న విశాఖ వాసి


  తలలు పట్టుకుంటున్న అధికారులు

  నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్‌ రిజర్వు (NSTR) బృందాలను పులిని ట్రాప్‌ చేసేందుకు రంగంలోకి దింపారు. పులి సంచరిస్తున్న పరిసర ప్రాంతాలు, ట్రాప్‌ కెమెరాల్లో చిత్రాలను అధికారుల బృందం క్షుణంగా పరిశీలిస్తోంది. పులి ప్రవర్తనను బట్టి..ఎన్ని బోనులు ఏర్పాటు చేసినా చిక్కే పరిస్థితి కనిపించడం లేదని కొందరు అధికారులు భావిస్తున్నారు. ఇక ఆఖరి ప్రయత్నంగా ట్రాంక్విలైజర్‌ (tranquilizer ) గన్‌తో పులికి మత్తు మందు ఇచ్చి బంధించే అవకాశం లేకపోలేదు.

  ఇది చదవండి: పిన్నిస్ ఉంటే చాలు..? ఎలాంటి బైక్ తాళమైన తుస్సే..? వీళ్లది మాములు టాలెంట్ కాదు..!


  తెలివైన పులిని పట్టుకునేందుకు ఆచీతూచీ అడుగులు
  ట్రాంక్విలైజర్‌ గన్‌తో మత్తు మందు ఇచ్చి పులి( Tiger) ని పట్టుకోవడంలోనూ అధికారులు ఆచీ తూచీ అడుగులు వేస్తున్నారు. ఇచ్చే మత్తు మందు మోతాదు కాస్త అటు, ఇటు అయినా పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. పొరపాటున మోతాదు ఎక్కువైతే చనిపోయే ప్రమాదం ఉంది. అదే తక్కువైతే ప్రశాంతంగా వెళ్తున్న పులిని కదిలించి రెచ్చగొట్టినట్లు అవుతుంది. ఆ సమయంతో పులి క్రూరంగా తయారై ప్రజలకు మరింత హాని కలిగించే ప్రమాదం ఉంది. అధికారులు ఇన్ని విధాలుగా ఆలోచిస్తూ ముందుకెళ్తుంటే..పులి మాత్రం వాళ్ల బోనులకు చిక్కకుండా దర్జాగా తప్పించుకుని తిరుగుతోంది.  ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్న అధికారులు
  ఎప్పటికప్పుడు పులి సంచరిస్తున్న ప్రాంతాలను గమనిస్తూ.., ఆయా ఊర్లను అధికారులు పూర్తిగా తమ ఆదీనంలోకి తీసుకుంటున్నారు. ఆ ప్రాంతంలోకి ప్రజలు, పశువులు, రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. పులిని తిరిగి అడవికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని.. ప్రజలు కాస్త ఒపికగా ఉంటూ సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. త్వరగా పులి గండం నుంచి ఎప్పుడు గట్టెక్కుతామా అని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటున్నారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Kakinada, Tiger

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు