Home /News /andhra-pradesh /

ROOSTERS GETTING READY FOR SANKRANTHI SEASON IN GODAWARI DISTRICTS OF ANDHRA PRADESH PRN

Andhra Pradesh: సంక్రాంతి కోడి పందెం అంటే మాటలా..! ఆ మాత్రం ఉండాల్సిందే..!

ఫైల్ ఫోటో

ఫైల్ ఫోటో

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లా (Godawari Districts) లు కూడా పందేలకు సై అంటున్నాయి. కోర్టు ఆంక్షలున్నా, పోలీస్ కేసుల భయాలున్న పందెం రాయుళ్లు తమ పుంజలకు ట్రైనింగ్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారు.

ఇంకా చదవండి ...
  తెలుగు లోగిళ్లు సంక్రాంతి పండుగకు సిద్ధమవుతున్నాయి. కొత్త బట్టలు, పిండి వంటలు, హరిదాసులు, రంగవల్లులకు తోడు కోళ్లు కూడా సంక్రాంతి బరికి సై అంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలు కూడా పందేలకు సై అంటున్నాయి. కోర్టు ఆంక్షలున్నా, పోలీస్ కేసుల భయాలున్న పందెం రాయుళ్లు తమ పుంజలకు ట్రైనింగ్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారు. ఒక్క పండుగ కోసం పందెం రాయుళ్లు ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. 9 నెలల నుంచి కోళ్లకు కఠోర శిక్షణ ఇవ్వడమే కాదు పందెంలో పరువు నిలబెట్టాలని వాటిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. కొబ్బరి, పామాయిల్ తోటల్లో పటిష్ట భద్రత మధ్య కోళ్లు పెరుగుతున్నాయి. కరోనా భయాన్ని కూడా లెక్క చేయకుండా పందెం రాయుళ్లు తమ పుంజులను సిద్ధం చేస్తున్నారు.

  రకరకాల జాతులు.., పంచాంగాన్ని బట్టి పందెం..
  ముఖ్యంగా పందాలను ట్రైనింగ్ ఇచ్చే కోళ్ల జాతులు కూడా దాదాపుగా 30 వరకు ఉన్నాయి. వీటిలో డేగ, కాకి డేగ, కాకి, మలి, ఎర్ర కిక్కిరాయి, కాకి నెమలి, నెమలి డేగ, కోడి మాయిలు, నెమలి పింగళ, సీతువా, రసింగి, పచ్చ కాకి డేగ, అబ్రాస్, తెల్ల కిక్కిరాయి, కాకి పెట్టమారి, కోడి డేగ, నల్ల కిక్కిరాయి, డేగ పూల, మైలా, కోడి కాకి జాతులకు చెందిన కోళ్లు ముఖ్యమైనవి. తమ దగ్గరున్న జాతులు, ఆరోజు నక్షత్రాలను బట్టి పందెలు కాస్తారు. కొంతమంది జ్యోతిష్యులను కూడా తీసుకొచ్చి వారిచ్చిన సలహాలు, సూచనల ప్రకారం పందోలు కాస్తారు. అంతేకాదు కోడి పుంజుల కోసమే రూపొందించిన పంచాంగం కుక్కుట శాస్త్రాన్ని బట్టి కూడా పెందేలు కాస్తారు. ఇందులో కోడి పుంజుల రకాలు, నక్షత్రాలు, వార ఫలాలు, కోడి పుంజులకు చికిత్స వంటి అంశాలపై అందులో వివరాలున్నాయి.

  ట్రైనింగ్ మామూలుగా ఉండదు..!
  సంక్రాంతి పందేల కోసం కోళ్లకు ఇచ్చై ట్రైనింగ్ మాములుగా ఉండందు. యుద్ధానికి వెళ్లే సైనికుడికి ఇచ్చే ట్రైనింగే దీనికీ ఉంటుంది. ఉదయం ఆరు గంటల నుంచే పందెం కోళ్లకు ట్రైనింగ్ మొదలు పెడతారు. మంచు ఎక్కువుగా ఉంటే ఈ పందెం కోళ్లను గూటిలో నుండి బయటకు రానివ్వరు. ఎనిమిది గంటల లోపు వాకింగ్ చేయించి ఈత కొట్టిస్తారు. అలా ఈత కొట్టిన కోళ్లను కాసేపు ఎండలో ఉంచుతారు. ఈత కొట్టించడం వల్ల పందెం కోళ్లలో ఆయాసం రాకుండా ఉంటుంది. దాదాపుగా ఒంటిగంట సమయం దాటినా తర్వాత వేడి నీళ్లతోనూ, వేడి చేసిన ఆయిల్ తోనూ కోడికి మసాజ్ చేస్తారు. అలా చేయడం వల్ల పందెం కోళ్లలో చలాకీతనం రావడంతో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా పోయే అవకాశం ఉంటుంది. మధ్యలో సమానంగా ఉన్న కోళ్లను ఎంపిక చేసి రెండిటి మధ్య ప్రాక్టీస్ పందెం పోటీ పెడతారు. ఇలా పోటీ పెట్టడం వల్ల ఏ పుంజు బలం ఎంతో ఒక అంచనాకు వస్తారు.

  ఆహారం.. రాజభోగమే..!
  పందాల కోసం పెంచే పుంజులను ఎంత జాగ్రత్తగా పెంచుతారో అంతే ఖరీదైన ఆహారం కూడా పెడతారు. పందెం కోళ్లు తినే ఆహారం చూస్తే మనకు రాజ భోగమే అనిపిస్తుంది. ఉదయం ఎనిమిది, తొమ్మిది గంటల మధ్య ప్రతి కోడికి రెండు నుండి 15 వరకు నానబెట్టిన బాదం పిక్కలను పెడతారు. దీనితో పాటు ఉడకబెట్టిన గుడ్లను ఆహారంగా అందిస్తారు. ముఖ్యంగా కాళ్ళు బలంగా ఉండటానికి, గుండెలపై కత్తి వేటు పడినా రక్తం వెంటనే రాకుండా ఉండటానికి, శరీరం గట్టిగా తయారు అవడం కోసం ఒక్కో కోడికి 50 గ్రాముల మటన్ కీమా పెడతారు. కీమాతో పాటు జీడిపప్పును కూడా అందిస్తారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో నానపెట్టిన గంట్లు, చోళ్ళు పెడతారు. ఇలాంటి ఆహారం పెట్టడం వల్ల పందెం కోళ్లలో కొవ్వు శాతం పెరగకుండా బలంగా తయారు అవుతాయి.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Cock fight, East Godavari Dist, Krishna District, Rooster attack, Sankranti, West Godavari

  తదుపరి వార్తలు