దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై రోజా స్పందన... తగిన శిక్ష...

దిశ హత్య కేసు నిందితుల ఎన్ కౌంటర్ ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా స్పందించారు.

news18-telugu
Updated: December 6, 2019, 3:39 PM IST
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై రోజా స్పందన... తగిన శిక్ష...
ఎమ్మెల్యే రోజా (File)
  • Share this:
దిశ హత్య కేసు నిందితుల ఎన్ కౌంటర్ ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా స్పందించారు. ఎన్ కౌంటర్‌తో దిశ అత్మకు శాంతి చేకూరిందని ఆమె వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లాలోని నగరిలో అంబేద్కర్‌ వర్థంతి వేడుకల్లో పాల్గొన్న రోజా... ఇకపై అలాంటి నేరం చేసిన వారికి తగిన శిక్ష పడుతుందనే సంకేతం ఇవ్వడం శుభపరిణామమని అన్నారు. దిశ అత్యాచార ఘటన బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడాలంటేనే భయపడేలా తెలంగాణ పోలీసులు చేశారని రోజా తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఇకపై అంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు.


First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>