విశాఖలో విషాదం... క్రేన్ ప్రమాద మృతుడి బంధువులు ముగ్గురు ప్రమాదంలో మృతి...

అసలే క్రేన్ ప్రమాదంలో 11 మంది చనిపోయారని అంతా బాధపడుతుంటే... తాజాగా జరిగిన ఈ ఘటన మరింత బాధపెడుతోంది.

news18-telugu
Updated: August 2, 2020, 12:34 PM IST
విశాఖలో విషాదం... క్రేన్ ప్రమాద మృతుడి బంధువులు ముగ్గురు ప్రమాదంలో మృతి...
విశాఖలో విషాదం... క్రేన్ ప్రమాద మృతుడి బంధువులు ముగ్గురు ప్రమాదంలో మృతి...
  • Share this:
విశాఖ జిల్లా... షిప్‌యార్డులో జరిగిన క్రేన్ ప్రమాదంలో... 11 మంది చనిపోయారని మనకు తెలుసు. మృతుల్లో ఒకరైన పి.భాస్కరరావును చూసేందుకు వెళ్లిన బంధువుల కుటుంబానికి రోడ్డు ప్రమాదం జరిగింది. కారుడ్రైవర్‌తోపాటూ... ఇద్దరు బంధువులు చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీకాకుళం జిల్లా కంచిలిలో జలంతర కోట హైవేపై ఆగి ఉన్న లారీని... బంధువులు ప్రయాణిస్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది. అసలేం జరిగిందంటే... తమ అల్లుడు క్రేన్ ప్రమాదంలో చనిపోయాడని తెలియగానే... బెంగాల్... ఖరగ్‌పూర్‌కి చెందిన 48 ఏళ్ల నాగమణి, ఆమె కొడుకులు రాజశేఖర్, ఈశ్వరరావు, ఇద్దరు కోడళ్లు 23 ఏళ్ల లావణ్య, పెతిలి... అందరూ కలిసి... కారులో బయల్దేరారు.

రోడ్డు ప్రమాదంలో నాగమణి, లావణ్య, 23 ఏళ్ల డ్రైవర్‌ రౌతుద్వారక స్పాట్‌లోనే చనిపోయారు. ఈ ప్రమాదాన్ని స్థానికులు చూశారు. పరుగెత్తుకొచ్చారు. అయ్యో అని బాధపడుతూ... గాయపడిన వారిని సోంపేట గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాజశేఖర్‌, పెతిలికి కొద్దిగా గాయాలు అవ్వగా... ఈశ్వరరావు పరిస్థితి విషమంగా ఉంది. సోంపేట ఆసుపత్రిలో డాక్టర్లు ఫస్ట్ ఎయిడ్ చేసి... శ్రీకాకుళం రిమ్స్‌కి తీసుకెళ్లమని చెప్పారు. ఈ విషాద ఘటనను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆగివున్న లారీని వెనక నుంచి ఢీకొట్టినట్లు గుర్తించారు. కారు బానెట్ తుక్కుతుక్కైంది.

హిందూస్థాన్‌ షిప్‌‌యార్డులో నిన్న జరిగిన క్రేన్ ప్రమాదం... ఏపీలో చర్చకు దారితీసింది. విశాఖలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ ఘటనలో స్పాట్‌లోనే 10 మంది చనిపోగా... మరొకరు ఆస్పత్రిలో చనిపోయారు. గాయపడిన వారు కోలుకుంటున్నారు. ఆ భారీ క్రేన్‌ను పదేళ్ల కిందట హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ కొంది. దాని నిర్వహణను ఈమధ్యే పొరుగు సేవల సిబ్బందికి ఇచ్చింది. ఈ విషాదంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
Published by: Krishna Kumar N
First published: August 2, 2020, 12:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading