Road Accident: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు భయపెడుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాద వార్తలు వినాల్సి వస్తోంది. ఇందులో ఎక్కువగా మనుషుల నిర్లక్షమే ప్రధాన కారణంగా నిలుస్తోంది. ముఖ్యంగా అతి వేగమే ప్రాణాలు తీసేలా చేస్తోంది. తాజాగా విజయనగరం జిల్లా (Vizianagaram Distrcit)లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తెర్లాం మండలం టెక్కలి వలస జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే వీరింతా చిన్న పిల్లలే.. ఎంతో భవిష్యత్తు ఉన్న ముగ్గురు విద్యార్థులను అతి వేగం బలితీసుకుంది. వారి కుటుంబాల్లో విషాదం నింపింది. తెర్లాం మండలం పెరుమాళి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు చదువుతున్నారు. 10 ఏళ్ల మైలపల్లి సిద్దు, 9 ఏళ్ల మైలపల్లి హర్ష, 9 ఏళ్ల వడ్డు ఋషి గా ఆ విద్యార్థులను గుర్తించారు. అయితే ఈ ముగ్గురు విద్యార్థులతో పాటు.. మరొక విద్యార్థిని మైలపల్లి మురళి అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై ఇంటికి తీసుకువస్తున్నాడు. ఈ క్రమంలో టెక్కలి వలస గ్రామం దగ్గరకు వచ్చేసరికి కారును ఓవర్ టేక్ చేస్తుండగా ఎదురుగా వస్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న నలుగురు విద్యార్థుల్లో ముగ్గురు మృతి చెందారు. ఈ ముగ్గురిలో మురళి సొంత కుమారులు అయిన మైలపల్లి సిద్దు, మైలపల్లి హర్ష, మురళి తోడల్లుడు కొడుకు అయిన వడ్డు ఋషి కూడా మృతి చెందాడు. ఈ ఘటనలో మురళీకి మరొక విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని రాజాం లోని ఓ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. మృతులది తెర్లాం మండలం పెరుమాలి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి : మరోసారి ఆయన్నే నమ్ముకున్న అధినేత.. 2024లో విజయం కోసం కీలక బాధ్యతలు
ముందు వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేయాలని స్పీడ్ పెంచాడు ఆ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి.. అయితే అదే సమయంలో అతి వేగంతో మరో బస్సు వస్తోంది. అది గమనించే లోపు ఆ బస్సు వచ్చి.. బైక్ ను ఢీ కొంది.. ఆ వేగానికి బైక్ తో సహా విద్యార్థులు చెల్లా చెదురయిపోయారు. విద్యార్థుల మరణంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. ముగ్గురు పిల్లలు చక్కగా చదువుకునే వారని.. మంచి భవిష్యత్తు ఉంటుందని అంతా కోరుకునే వారు. అలాంటి వారు ఇలా ప్రమాదంలో మరణించడంతో.. ఆ గ్రామంలో పెను విషాదం నెలకొంది. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, Road accident, Vizianagaram