Road Accident: ఆదివారం సెలవు రోజు కావడంతో.. సరదాగా బయటకు వెళ్లడమే వారికి శాపమైంది.. ఓ వైపు మాడు పగిలే ఎండ ఉండడంతో.. రోడ్డు పక్కనే అమ్ముతున్న తాటి ముంజెలను చూశారు. కాసేపు చల్లబడొచ్చు అని.. పిల్లలు తింటామని మారాం చేయడంతో.. అవి తిందామని అక్కడి వెళ్లడమే వారి పాలిట మృత్యువుగా మారింది. ఇష్టపడి కొన్న అవి తినే లోపే.. మరణం వారిని కబళించింది. మొత్తం కుటుంబాన్ని చిదిమేసింది. ఈ ప్రమాదం (Accident)లో మరో ముగ్గురు సైతం తీవ్ర గాయాలపాలయ్యారు. ఫోటో షూట్ (Photo shoot) కోసం కాకినాడ (Kakinada) నుండి అరకు (Araku) వెళ్లి.. అక్కడి అందాలను బంధించి తిరుగు ప్రయాణంలో ఉన్న సమయంలో కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఘోర ప్రమాదం జరిగింది. దీంతో ఓ తండ్రి సహా ఇద్దరు గిరిజన చిన్నారుల ప్రాణాలు బలి కావాల్సి వచ్చింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitaramaraju District) అనంతగిరి మండలం కోనాపురం గ్రామానికి చెందిన కిల్లో సేనాపతి (Killo Senapathi) అదే మండలంలోని శివలింగపురం ట్రైబల్ వెల్ఫేర్ వసతి గృహాంలో తెలుగు టీచర్ (Telugu Teacher) గా, వార్డెన్‌గా పనిచేస్తున్నారు. ఈయనకు కొద్ది సంవత్సరాల కిందట ఇదే గ్రామానికి చెందిన శ్రావణితో ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. శివలింగపురంల విధులు నిర్వహిస్తున్నప్పటికీ సేనాపతి కుటుంబంతో విజయనగరం జిల్లా (Vizianagaram District) శృంగవరపుకో టలో నివాసం ఉంటున్నాడు. పిల్లలిద్దరూ స్థానిక పాఠశాలలో చదువుతున్నారు. సేనాపతి తాను పనిచేస్తున్న వసతిగృహంలో విద్యార్థుల మధ్యాహ్న భోజనం పరిశీలనకు వెళ్లి వచ్చేద్దామని శివలింగపురం బయలుదేరాడు. సెలవు కావడంతో పిల్లలు తాము కూడా అక్కడకు వస్తామని మారాం చేశారు. కాదనలేక కుటుంబంతో కలిసి బయలుదేరాడు. మార్గ మధ్యంలో రాజీపేట-గౌరిపురం సమీపంలోని సిమెంట్ ఇటుకుల పరిశ్రమ దగ్గరకు వచ్చేసరికి రోడ్డు పక్కన తాటి ముంజెలు అమ్ముతుండడాన్ని చూసిన పిల్లలు కావాలని కోరారు.
ఇదీ చదవండి : కొడాలి నానికి సీఎం జగన్ చెప్పిన సీక్రెట్ ఏంటి..? ఆయన మాటలకు అర్థం అదేనా..?
ద్విచక్ర వాహనాన్ని పక్కన నిలిపి బండిపై పిల్లలను కూర్చోబెట్టి తాటి ముంజెలు కొన్నాడు. వాటిని భార్యభర్త ఒలుస్తూ పిల్లలకు పెడుతున్నారు. వీరికి దగ్గరగా పక్కనే పెదఖండే పల్లి గ్రామానికి చెందిన కోసర అప్పారావు తన తమ్ముడు కుమార్తె కోసర సుహిత కూడా ఇలానే బండిపై కూర్చోబెట్టి తాటిముంజెలు తినిపిస్తున్నాడు. అంతా సరదాగా సాగిపోతున్న సమయంలో.. అరకు నుంచి విశాఖపట్నం వైపు అతివేగంగా వస్తున్న కారు అదుపు తప్పి తాటి ముంజెలు విక్రయిస్తున్న పాకపై పడి అక్కడే ఉన్న బైక్‌లను ఢీకొట్టి పక్కన నిల్చున్న వారిని ఈడ్చుకుపోయింది.
ఇదీ చదవండి : రాజీనామాకు కారణం అదే.. మాజీ హోం మంత్రి సుచరిత సంచలన వ్యాఖ్యలు
ఈ ప్రమాదంలో సేనాపతి కుమారులు శ్రావణ్, సుహాన్ సహా వారి తల్లిదండ్రులు, పక్కనే రోడ్డుపై ముంజెలు తింటున్న వారంతా రోడ్డుపై ఎగిరి పడ్డారు. మరికొంత మంది పక్కనే ఉన్న తుప్పల్లోకి ఎగిరిపడ్డారు. దీంతో చిన్నారులు సహాన్, శ్రావణ్ లిద్దరూ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సేనాపతి, అతని భార్యను వెంటనే 108 వాహనంలో ఎస్.కోట సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడే ముంజెలు తింటూ నిల్చొని ప్రమాదంలో గాయపడ్డ అప్పారావు, పాప సుహితను కూడా ప్రైవేటు వాహనంలో ఎస్.కోట ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి : దళిత మహిళకు హోం శాఖ.. డిప్యూటీగా రాజన్నదొర.. ఫైనల్ లిస్ట్ ఇదే
పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో నలుగురినీ విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. విశాఖలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సేనాపతి కూడా ప్రాణాలు విడిచాడు. చిన్నారి సుహిత ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. ఇక ప్రమాదంలో మొత్తం కుటుంబాన్ని కోల్పోయిన సేనాపతి భార్య శ్రావణికి వెన్నుపూస దెబ్బతింది. కారులోని బెలూన్లు బయటకు రావడంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా చిన్న గాయాలతో బయటపడ్డారు.
ఇదీ చదవండి : సీఎం చేతిని ముద్దాడి.. కాళ్లకు నమస్కారం.. ప్రమాణ స్వీకార హైలైట్స్ ఇవే
ప్రమాద విషయం తెలిసిన వెంటనే మృతుల బంధువులు, స్నేహితులు ఆస్పత్రికి చేరుకుని భోరున విలపించారు. వారి రోదనలతో ఆస్పత్రి ఆవరణ మొత్తం విషాదమయమైంది. ప్రమాదం గురించి తెలుసుకున్న ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అక్కడకు చేరుకుని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ప్రమాదానికి కారణమైన కల్వర్టు గోతిని వెంటనే సరిచేయాలని అధికారులకు ఆదేశించారు. ఎస్‌ఐ లోవరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి : పాత కొత్త కలయికతో కొలువుదీరిన కేబినెట్.. జగన్ కు పాదాభివందనాలు
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలిరోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కిల్లో సేనాపతి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండల గిరిజనులు శృంగవరపుకోట పోలీస్‌స్టేషన్ ముందు అదివారం రాత్రి ఆందోళన చేశారు. ప్రమాద బాధితులను కనీసం పోలీసులు పట్టించుకోకుండా, యాక్సిడెంట్ చేసిన వారితో మంతనాలు సాగించి పంపించేసారంటూ ఆందోళన చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, Road accident, Vizianagaram