కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ సమీపంలో ఘోరం రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున బాపుపాడు మండలం బొమ్ములూరు వద్ద జరిగిన జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గరు ఘటన స్థలంలోనే మృతిచెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఏడుగురు వ్యక్తులు ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. వారిలో నలుగురు నూజివీడుకు చెందినవారు, ఇద్దరు పశ్చిమ గోదావరి జిల్లా ఎర్రగొండపల్లి, ఒకరు విజయవాడకు చెందినవారు ఉన్నారు.
వీరంతా భీమవరంలో జరిగిన ఓ వివాహనికి హాజరై.. అనంతరం నూజివీడుకు కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందినవారిని పశ్చిమ గోదావరి జిల్లా ఎర్రగొండపల్లికి చెందిన తాతారావు (65), కనకదుర్గ(60), విజయవాడకు చెందిన చీమకుర్తి నాగేశ్వరరావు(75) పోలీసులు గుర్తించారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.