హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Road Accident: Road Accident: స్వామి దర్శనానికి వెళ్తూ పరలోకానికి.. రోడ్డు ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు మృతి

Road Accident: Road Accident: స్వామి దర్శనానికి వెళ్తూ పరలోకానికి.. రోడ్డు ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు మృతి

నలుగురు అయ్యప్ప స్వామి భక్తులు దుర్మరణం

నలుగురు అయ్యప్ప స్వామి భక్తులు దుర్మరణం

Road Accident: వారంతా అయ్యప్ప స్వామి భక్తులు.. స్వామిని దర్శించుకుని ముక్తి పొందాలని వెళ్తున్న వారిని విధి బలితీసుకుంది. బాపట్ల దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు దుర్మరణం పాలయ్యారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Bapatla, India

Road Accident: ఆంధ్రప్రదేశ్  (Andhra Pradesh) లో వరుస రోడ్డు ప్రమాదాలు (Road Accidents) వెంటాడుతున్నాయి. ముఖ్యంగా పుణ్యక్షేత్రాలకు.. దేవుడి దర్శనానికి వెళ్తున్న భక్తులను రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. బాపట్ల జిల్లా (Bapatla District) వేమూరు మండలం జంపని దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు (Ayyappa Devotees) మరణించారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు తెనాలి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వామి శరణం అంటూ అయ్యప్ప భక్తుల భజన చేసుకుంటూ తో వెళ్తున్న ఆటో బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు కృష్ణా జిల్లా (Krishna District) కు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదానికి కారణంపై పూర్తివివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.

అయితే ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించబోయి ఆటో బోల్తాపడినట్లు సమాచారం. మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోధనలతో ఆస్పత్రి ప్రాంగణంలో విషాదం నెలకొంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Crime news, Road accident

ఉత్తమ కథలు