చిత్తూరు జిల్లాలో విషాదం... రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

అయితే కరోనా లేదంటే ఇలా రోడ్డు ప్రమాదాలు... ఏదో ఒక రకంగా అయిన వాళ్లు చనిపోతున్నారు. ఆ కుటుంబాల్లో విషాదం ఉంటోంది. అసలీ రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది?

news18-telugu
Updated: August 30, 2020, 12:38 PM IST
చిత్తూరు జిల్లాలో విషాదం... రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
చిత్తూరు జిల్లాలో విషాదం... రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి (File)
  • Share this:
చిత్తూరు జిల్లాలో... కొన్ని రోడ్లు బాగుంటాయి. కొన్ని గతుకులతో ఉంటాయి. బంగారుపాలెం మండలం బలిజ పల్లె గ్రామం దగ్గర ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అసలేమైందంటే... అక్కడ చిన్నపాటి మలుపు లాంటి చోట... ఓ లారీ ఆగివుంది. దాని వెనక ఓ బైక్‌పై ఓ వ్యక్తి ఉన్నారు. ఓ కారు... వేగంగా వచ్చి... బైక్‌ని ఢీ కొట్టింది. బైక్‌ని ఈడ్చుకూంటూ వెళ్లి లారీని వెనక నుంచి ఢీ కొట్టింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం. కారు నుజ్జు నుజ్జైంది. అందులోని వాళ్లు చెల్లా చెదురుగా పడి... రక్తమోడుతూ... స్పాట్‌లోనే ప్రాణాలు విడిచారు. అంతా జస్ట్ సెకండ్లలో జరిగిపోయింది. బైక్ స్వరూపం పూర్తిగా మారిపోయి పచ్చడైపోయింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు... అయ్యో... అయ్యో అంటూ పరుగెత్తుకుంటూ వచ్చారు.

ఈ ప్రమాదంలో కారులోని ఓ మహిళ ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. బైక్‌పై వ్యక్తి కూడా చనిపోయారు. కారు నెంబర్‌‌ని బట్టీ అది కర్ణాటకలో రిజిస్ట్రేషన్ అయినట్లు అర్థమైంది. ఆ కారు కర్ణాటక నుంచి చిత్తూరు వైపు వెళ్తోంది. తిరుపతికి వెళ్తున్నట్లు భావిస్తున్నారు. కొన్ని నిమిషాలకే అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు పోగయ్యారు. ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ జామ్ అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు... అక్కడకు వచ్చి... జనాన్ని పంపించేశారు.

కారులో ప్రయాణం చేస్తున్న వారు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోక పోవడం వల్ల... ఇంత ఘోరం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతులు బంగారు పాళ్యంకు చెందిన బాబు (45)... బైక్ నడిపిన వ్యక్తి కాగా... వెంకటేశ్వరులు (29), రత్నమ (49), శ్రీనివాసులు రెడ్డి (55) ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు పోలీసులు.
Published by: Krishna Kumar N
First published: August 30, 2020, 11:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading