Road Accident in Andhra Pradesh: ఆంధ్రప్రేదశ్ (Andhra Pradesh) ను వరుస ప్రమాదాలు భయపెడుతున్నాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వరుస ప్రమాదాలకే కేరాఫ్ గా నిలుస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే ఎదో ఒక ప్రమాదం సంఘటన గురించి వార్తలు వినాల్సి వస్తోంది. నిత్యం ఇక్కడ ప్రమాదాలు జరుగుతుండడంతో స్థానిక వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా (Anantapuram District)లో మరో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) భయపెట్టింది. మినీ బస్సు బోల్తా పడిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం పులగంపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం తిరుమల (Tirumala)కు వెళ్లి తిరిగి పులగంపల్లి వస్తుండగా జరిగినట్లు ప్రాధమిక సమాచారం. మినీ బస్సులో మొత్తం 32 మంది కుటుంబసభ్యులు ప్రయాణిస్తుండగా వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు.. వారి బంధువులుగా తెలుస్తోంది. 45 ఏళ్ల చలపతి, 40 ఏళ్ల బాదమ్మ బార్యాభర్తలు, వీరితో పాటు మేనల్లుడు 23 ఏళ్ల ఈశ్వరయ్య అక్కడికి అక్కడే మృతి చెందగా మరో 22 మందికీ తీవ్రగాయాలైయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను కదిరి ఆసుపత్రికి తరలించారు.
వారంతా తిరుమల దైవ దర్శనానికి వెళ్లి వస్తున్నారు.. కలియుగ దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వ స్వామి దర్శన భాగ్యం చేసుకోవడంతో వారంతా చాలా ఆనందగా కనిపించారు. స్వామి దర్శనంతో తమ కోరికలు తీరుతయాని సంతోషంగా ఉన్నారు. అలా తిరుమల విశేషాలు చెప్పుకుంటూ.. రాత్రి కావడంతో అందరు నిద్ర మత్తులో జారుకున్నారు. ఈ క్రమంలో.. ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మినీ బస్సు బోల్తా పడటంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.బాధితులందా పులగంపల్లికి చెందినవారని తెలిపిన స్థానికులు.. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. మరో పది నిమిషాల్లో సొంతూరుకు చేరుకుంటామనగా ప్రమాదం జరగడంతో గ్రామంలో విషాదం నెలకొన్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
ఇదీ చదవండి : టాలీవుడ్ వివాదానికి నేటితో తెరపడుతుందా..? భేటికి ఎవరెవరు హాజరవుతున్నారంటే..?
స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరంతా తిరుపతి దైవ దర్శనానికి వెళ్లి తిరిగివస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై నల్లమాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, AP News, Crime news, Road accident, Tirumala