మూడు రాజధానులపై (AP 3 Capitals)) ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని జగన్ (YS Jagan) ప్రభుత్వంపై టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. అటూ వైసీపీ కూడా అంతకు మించిన స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. ఈ క్రమంలో తాజాగా మంత్రి రోజా (RK Roja).. చంద్రబాబునాయుడు (Chandrababu naidu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో తిరుమల (Tirumala) స్వామి వారి సేవలో పాల్గొన్న రోజా.. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే పరిపాలన వికేంద్రీకరణ., అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నామని స్పష్టం చేశారు. 58 ఏళ్ళ ముందు రాయలసీమకు రావాల్సిన రాజధాని రాలేదని... ఐదు దశాబ్దాల అనంతరం రాయలసీమ ప్రజల కల సాకారం కానుందని ఆమె చెప్పారు. రాయలసీమ బిడ్డగా న్యాయరాజధాని కావాలన్న సంకల్పంతో జగన్ ఉన్నారని తెలిపారు. విశాఖను రాజధాని పెట్టాల్సింది.... కానీ ఆ రోజుల్లో పెట్టలేక పోయామని పుచ్చలపల్లి సుందరయ్య అన్నారని....ఇప్పుడా కలను సీఎం జగన్ సాకారం చేస్తున్నారని చెప్పారు మంత్రి రోజా.
AP Rains: ఏపీని వదలని వరుణుడు.. ఈ జిల్లాల్లో ఇవాళ కూడా భారీ వర్షాలు..
''రాయలసీమకు పరిపాలన రాజధాని వస్తుంటే చంద్రబాబు ఆనందించాలి. కానీ తన బినామీలతో అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న చంద్రబాబు.. అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ నీచ రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు చరిత్ర హీనుడుగా మిగిలిపోవడం ఖాయం. రాష్ట్ర ప్రజలు మూడు రాజధానులకు మద్దతు ఇస్తూ... స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి పట్టంగట్టారు. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా.....పెయిడ్ ఆర్టిస్ట్‌లతో అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా అమరావతి నుంచి ఉత్తరాంధ్రకు పాదయాత్ర చేయడం బాధాకరం. వైఎస్ జగన్ పరిపాలన వికేంద్రీకరణ., అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తుంటే... చంద్రబాబు స్వార్థపాదయాత్రను తలపెట్టారు. ఉత్తరాంధ్రలో పరిపాలన రాజధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ వెన్నుదండుగా ఉంటూ.. ఆయనకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు బయటకు వస్తారు. ఉత్తరాంధ్ర సంఘీభా కార్యక్రమాన్ని పక్కదారి పట్టించడానికి పవన్ మూడు రోజులు కార్యక్రమం చేపట్టారు. రాయలసీమ ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలకు మద్దతు ఇస్తున్నామని ఇప్పటికే చెప్పారు. ఎన్నో పుస్తకాలు చదివానని గొప్పలు చెప్పుకొనే పవన్.... ఉత్తరాంధ్ర., రాయలసీమ ప్రజల కష్టాల బుక్కులు చదవలేదా..?'' అని మంత్రి రోజా పేర్కొన్నారు.
అన్ స్టాపబుల్ షోలో బావబామ్మర్దులు కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పారని...ఎన్టీఆర్‌ను పదవి దాహంతో వెన్నుపొటు పొడిచి... పార్టీని లాక్కొని ఆయన మరణానికి చంద్రబాబు కారణమయ్యాడని విమర్శించారు రోజా. ఎన్టీఆర్‌ను కాళ్ళు పట్టుకొని ఏడ్చానని చెబుతూ.. ప్రజలను పిచ్చోళ్ళని చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ తన నా ఆరాధ్య దైవమని చంద్రబాబు చెప్పడం దెయ్యలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు రోజా. ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరి, పార్టీని లాక్కొని, పార్టీ ఆఫీస్ నుంచి ఎన్టీఆర్‌ను వెళ్లగొట్టారని ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్టీఆర్ కుటుంబాన్ని రోడ్డుపైకి తీసుకొచ్చాడని విమర్శించారు. ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసి రాష్ట్రాన్ని ముక్కలు చేసారని...కుప్పం ప్రజలను సైతం చంద్రబాబు మోసం చేసాడనని అన్నారు. పరిపాలన రాజధాని, న్యాయ రాజధానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను ప్రజలే తరిమి కొడతారని విరుచుకుపడ్డారు మంత్రి రోజా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Rk roja