హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Rk Roja: పవన్ కళ్యాణ్ కుంభకర్ణుడు..మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

Rk Roja: పవన్ కళ్యాణ్ కుంభకర్ణుడు..మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

పవన్ కు రోజా కౌంటర్

పవన్ కు రోజా కౌంటర్

పవన్ కళ్యాణ్ కుంభకర్ణుడిలా 6 నెలలు నిద్రపోవడం మేల్కోనడంలా రాజకీయం చేస్తున్నారని ఏపి మంత్రి, నగరి ఎమ్మెల్యే ఆర్.కే.రోజా విమర్శించారు. ఇవాళ ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

Hemanth Kumar, News 18, tirumala

పవన్ కళ్యాణ్ కుంభకర్ణుడిలా 6 నెలలు నిద్రపోవడం మేల్కోనడంలా రాజకీయం చేస్తున్నారని ఏపి మంత్రి, నగరి ఎమ్మెల్యే ఆర్.కే.రోజా విమర్శించారు. ఇవాళ ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన మంత్రి ఆర్.కే.రోజా మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు కోడలిగా పెరటాశి మాసంలో స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని, అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అనేది జగన్ అన్న పాలసీ అని, ఆయన సైనికులైన మేము అదే పాటిస్తాంమని ఆమె అన్నారు. మూడు రాజధానులతో మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలనేది సీఎం జగన్ ఆకాంక్ష అని, గతంలో హైదరాబాద్ నుంచి మనం రావడం వల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నామని, అలాంటి ఇబ్బంది పడకూడదని తండ్రి లాంటి మనసుతో సీఎం జగన్ అలోచించి మూడు రాజధానులు అంశం తీసుకొచ్చారని ఆమె వివరించారు.

తెలుగు దేశం పార్టీ నాయకులు, నానాయాగీ చేస్తూ ప్రాంతాలను రెచ్చ గొడుతున్నారని, వైజాగ్ ప్రాంతంలో పాదయాత్ర పెట్టి మీసాలు తిప్పుతూ, తొడలు కొడుతూ వెళ్తున్నారని ఆమె విమర్శించారు. 29 గ్రామాల కోసం, 26 జిల్లాలను పణంగా పెట్టాలని ఎవరు కోరుకోరని, 40 ఏళ్ల అనుభవంతో 5 ఏళ్ళ కాలంలో చంద్రబాబు ఎందుకు అభివృద్ధి చేయలేక పోయారని ఆమె ప్రశ్నించారు.. తాత్కాలిక భవనాలు మాత్రమే నిర్మించారని, శాశ్వత భవనాలు ఎక్కడ నిర్మించలేదన్నారు.. అమరావతి ఉద్యమం కాదని అత్యాశ పరుల ఉద్యమం అని ఆమె మండిపడ్డారు.. తలసరి ఆదాయం బాగా ఉన్న అమరావతిని అభివృద్ధి చేయాలంటే 1.10 లక్షల కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి అభివృద్ది చేయాలని, 29 గ్రామాలు అభివృద్ధి కన్నా 26 జిల్లాలు అభివృద్ధి చెందాలని కోరుకోవడంలో ఏం తప్పు ఉందన్నారు.. పరిపాలన రాజధాని వైజాగ్ లో టీడీపీ పాదయాత్ర చేపట్టి, ప్రాంతాల మధ్య ద్వేషాలు చిచ్చురేపి రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తుందన్నారు.

అందుకే చంద్రబాబు, లోకేష్ లు అలాంటి కార్యక్రమం చేపట్టారని తెలుస్తోందని, పవన్ కళ్యాణ్ కుంభ కర్ణుడిలా 6 నెలలు నిద్రపోవడం మేల్కునట్లు రాజకీయం చేస్తున్నాడని, అప్పుడప్పుడు రాజకీయాల్లో ప్రెస్ మీట్, ట్వీట్ లతో సరిపెట్టుకుంటున్నాడని సీరియస్ పొలిటిషన్ గా ప్రజలకు ఏం చేసాడని ఆమె ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు దత్తపుత్రుడని, టీడీపీ ఐదేళ్ల పాలనలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు పవన్ కి కనపడలేదా అని ఆమె అడిగారు. ఉత్తరాంధ్ర అంత వలసలు వెళ్తున్నారని విచిత్రమైన ట్వీట్ చేసాడని, కేంద్రంతో నువ్వు జత కట్టిన బిజెపి, టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో నీకు కనపడలేదా ఈ ఉత్తరాంధ్ర వలసలు అని ఆమె ప్రశ్నించారు. వైఎస్ఆర్ పాలనలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగిందని, మళ్లీ ఇప్పుడు జగన్ పాలనలో అభివృద్ధి సాగుతుందన్నారు. అదానీ డేటా సెంటర్, ఇన్ఫోసిస్, బీచ్ కారిడార్ జగన్ హయాంలోనే వచ్చాయని, ఉత్తరాంధ్రలో ఎయిర్పోర్ట్ వచ్చిన, భావనపాడులో పోర్టు వచ్చింది సీఎం జగన్ వల్లే అని, ఎసిటి టైర్ల కంపెనీ ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్ దే అని ఆమె కొనియాడారు.

విశాఖరూరల్, శ్రీకాకుళం అభివృద్ధి చెందాలని పరిపాలన రాజధాని వైజాగ్ గా చేస్తున్నామని, రాయలసీమలో హైకోర్టు ఇతర కార్యాలయాలను కట్టడం వల్ల మూడు ప్రాంతాలు అభివృద్ధి జరుగుతాయని, పవన్ కళ్యాణ్ తెలుసుకొని మాట్లాడాలని, గతంలో పవన్ కళ్యాణ్ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని మాట్లాడారని ఆమె గుర్తు చేశారు. ప్యాకేజ్ ముట్టింది కాబట్టే ఇలాంటి మాటలు పవన్ మాట్లాడుతున్నారని, చంద్రబాబు బినామీ లింగమనేని పవన్ ఆఫీస్ కి తనకు భూములు ఇచ్చాడు కాబట్టి రేట్లు పోకుండా పవన్ మాట్లాడుతున్నాడా అనే విషయం తెలపాలన్నారు. పార్టీ పెట్టడం కాదు, సీరియస్ పొలిటిషన్ గా రాష్ట్రంలో జరుగుతున్న మంచిని ఆహ్వానించాలని, తప్పులు ఉంటే సరిదిద్దుకుంటాంమని, పూటకి ఓ మాట, రోజుకో ట్వీట్ పెడితే ప్రజలు తిరగబడి కొడుతారని ఆర్.కే.రోజా వ్యాఖ్యానించారు.

First published:

Tags: Andhrapradesh

ఉత్తమ కథలు