హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

World record: వీణ తయారీలో అతడ్ని మించినోడు లేడు .. ఎన్ని వరల్డ్ రికార్డ్‌లు వచ్చాయో తెలుసా..?

World record: వీణ తయారీలో అతడ్ని మించినోడు లేడు .. ఎన్ని వరల్డ్ రికార్డ్‌లు వచ్చాయో తెలుసా..?

world record

world record

World record: వీణతో రాగాలు పలికించాలంటే సంగీతంలో నైపుణ్యం ఉండాలి. మరి అలాంటి వీణ తయారు చేయాలంటే అంత ఈజీ కాదు. వీణల తయారీకి విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రసిద్ది. అయితే కృష్ణా జిల్లాలో రెండు దశాబ్దాలుగా వీణలు తయారు చేస్తూ  9 ప్రపంచ రికార్డులు నెలకొల్పిన ఓ ముస్లిం కుటుంబం గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఆ వివరాలు మీకోసం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nuzvid, India

(Anna Raghu,Sr.Correspondent,Amaravathi,News18)

వీణతో రాగాలు పలికించాలంటే సంగీతంలో నైపుణ్యం ఉండాలి. మరి అలాంటి వీణ తయారు చేయాలంటే అంత ఈజీ కాదు. వీణల(Harps)తయారీకి విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రసిద్ది. అయితే కృష్ణా జిల్లా (Krishna)నూజివీడు(Nujiveedu)లో రెండు దశాబ్దాలుగా వీణలు తయారు చేస్తూ  9 ప్రపంచ రికార్డులు నెలకొల్పిన ఓ ముస్లిం(Muslim)కుటుంబం గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఆ వివరాలు మీకోసం.

Tirumala: తిరుపతి టు తిరుమలకు రోప్ వే సాధ్యమా..? అసలు సమస్య ఏంటేంటే?

రెండు దశాబ్దాల అనుభవం..

నూజివీడుకు చెందిన షేక్ కాశీం సాహెబ్ 90 సంవత్సరాల కిందటే సన్నాయి విధ్వాంసుడు. అంతే కాదు వీణ కూడా తయారు చేసే నైపుణ్యం ఆయన సాధించారు. ప్రపంచ ప్రఖ్యాత సింగర్ ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారికి కూడా కాశీం సాహెబ్ వీణ బహుకరించారు. అంటే కాశీం సాహెబ్ తయారు చేసే వీణలు ఎంత నాణ్యమైనవో అర్థం చేసుకోవచ్చు. కాశీం సాహెబ్ కు నలుగురు కుమారులు. అందులో మూడో కుమారుడు షేక్ మీరా సాహెబ్ కూడా తండ్రి వద్ద వీణల తయారీలో మెళకువలు నేర్చుకున్నాడు. ఆ తరువాత ఆయన కుమారుడు షైక్ మాబుకు  వీణ తయారీ నేర్పించారు. షైక్ మాబు వీణలు తయారు చేయటంలో ఎన్నో ప్రయోగాలు చేసి అతి చిన్న వీణ చేసిన ఘనత సాధించాడు .ఇప్పుడు ముచ్చటగా మూడు, నాలుగో తరాల వారు వీణలు తయారు చేస్తున్నారు.

శ్రమ ఎక్కువ ఆదాయం తక్కువ..

అంత ఈజీ కాదు వీణల తయారీకి జాక్ ఉడ్( పనస కర్ర) , జర్మన్ స్టింగ్స్ , కంచు మిట్ల వాడాల్సి ఉంటుంది. అవి స్థానికంగా లభించడం లేదు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వాటిని దిగుమితి చేసుకుంటున్నారు.  ఒక మనిషి 15 రోజులు కష్టపడితేగాని  ఒక వీణ తయారవదు. వీణ తయారీకి వాడే మెటీరియల్ కోసం దాదాపు రూ.20 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 15 రోజులు కష్టపడి వీణ తయారు చేస్తే వారికి లభించేది కేవలం రూ.30 వేలు మాత్రమే. అంటే 15 రోజులు కష్టపడితే వారికి లభించేది ఖర్చులు పోను కేవలం రూ.10 వేలు మాత్రమేనని వారు తెలిపారు.

వీణల తయారీలో ప్రపంచ రికార్డు..

సహజంగా రంగస్థలాలపై వీణ ద్వారా ప్రదర్శన ఇవ్వాలంటే 53 అంగుళాల వీణ ఉపయోగించాల్సి ఉంటుంది. కాని నూజివీడుకు చెందిన షైక్ మాబు తయారు చేసిన 21 అంగుళాల వీణ అద్భుతంగా పనితీరు కనబరిచింది. వీణా విధ్వాంసురాలు వీణ శ్రీ వాణి 21 అంగుళాల వీణలో హైదరాబాద్ లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ఇంత చిన్న వీణ తయారు చేసినందుకు కాశీం సాహెబ్ మనవడు షైక్ మాబు కు  అవార్డులు అందించారు. అంతేకాదు వీరు తయారు చేసిన వీణలు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు షైక్ మాబు బహుకరించారు.

East Godavari: మ‌న్యాన్ని వ‌ణికిస్తోన్న లేఖ.. అస‌లు అందులో ఏముంది..?

ఎన్నో ప్రశంసలు,అవార్డులు..

సంగీత విధ్వాంసులు అయ్యగారు శ్యాంసుందర్, కొప్పు శ్యామేశ్వరరావు , వీణ శ్రీ వాణి, జై శ్రీనివాస్, బోనాల శంకర్ ప్రకాష్ గారు, భరధ్వాజ్, వేమని లలితక్రిష్ణ, ఎ. శారదలు కూడా కాశీం సాహెబ్ కుటుంబం తయారు చేస్తున్న వీణలు ఉపయోగించారు. ఇక వీరు తయారు చేసిన వీణకు సంగీత విధ్వాంసుడు బాలమురళీకృష్ణ కూడా ముగ్దుడయ్యారు. ప్రస్తుతం కాశీం కుటుంబంలోని నాలుగో తరంలోని నాగూర్, జానీ కూడా వీణలు తయారు చేయటం నేర్చుకుంటున్నారు.

First published:

Tags: Andhra pradesh news, Krishna District

ఉత్తమ కథలు