RESERVE BANK OF INDIA SHOCKS AP GOVERNMENT ON OVERDRAFT ISSUE FULL DETAILS HERE PRN
AP Debts: ఏపీకి షాకిచ్చిన ఆర్బీఐ..? అప్పు చేతికి రాకుండానే జమ..?
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ప్రస్తుతం అప్పులపైనే నడుస్తోందనేది వాస్తవం. సంక్షేమ పథకాలు (AP Welfare Schemes) భారీగా అమలు చేస్తుండటం, కరోనా కారణంగా ప్రభుత్వానికి ఆదాయం తగ్గడంతో పాటు పలు కారణాల వల్ల అప్పులు చేయక తప్పడం లేదు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ప్రస్తుతం అప్పులపైనే నడుస్తోందనేది వాస్తవం. సంక్షేమ పథకాలు (AP Welfare Schemes) భారీగా అమలు చేస్తుండటం, కరోనా కారణంగా ప్రభుత్వానికి ఆదాయం తగ్గడంతో పాటు పలు కారణాల వల్ల అప్పులు చేయక తప్పడం లేదు. ప్రతి నెల ఉద్యోగుల జీతాలను కూడా అప్పుచేసే చెల్లించాల్సి వస్తోందన్న ప్రచారం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో రుణపరిమితిని మించిపోవడం., కేంద్రం పరిమితి పెంపుకు సరేమిరా అనడం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ వద్ద ఓవర్ డ్రాఫ్టుగా కూడా నిధులు తీసుకుంది ఏపీ ప్రభుత్వం. విద్యుత్ రంగంలో సంస్కరణ వల్ల అదనంగా రూ.2133 కోట్లను అప్పుగా తీసుకునేందుకు ఇటీవలే కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో చాలా రోజుల తర్వాత సెక్యూరిటీల వేలంలో పాల్గొని రుణం తీసుకున్న ఏపీకి ఆర్బీఐ షాకిచ్చినట్లు తెలుస్తోంది.
సెక్యూరిటీల వేలంలో వేలంలో భాగంగా 7.37 వడ్డితో వెయ్యి కోట్ల రుణాన్ని 16 ఏళ్ల కాలపరిమితో.. మరో వెయ్యి కోట్ల రుణాన్ని అధే వడ్డీతో 20ఏళ్ల కాలపరిమితితో ప్రభుత్వం రుణంగా తీసుకుంది. ఐతే అప్పటికే ఆర్బీఐ వద్ద ఏపీ ప్రభుత్వం భారీగా ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవడంతో ఆ బకాయి కింద తీసుకున్న అప్పుమొత్తాన్ని ఆర్బీఐ జమ చేసుకుంది. దీంతో వడ్డీకి తీసుకొచ్చిన అప్పు ఓడీకి సరిపెట్టాల్సి వచ్చింది.
ఇటీవల ఏపీ ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 2021-22 ఆర్ధిక సంవత్సవం నాలుగో త్రైమాసికంలోనూ అప్పులు తీసుకోక తప్పలేదు. కొత్త ఏడాది ఆరు వారాల్లో ఏకంగా రూ.4500 కోట్ల అప్పులు చేసింది. జనవరి మొదటివారంలో రూ.2500 కోట్లు అప్పుగా తెచ్చిన ప్రభుత్వం.. తాజాగా చేసిన 2వేల కోట్లతో అది రూ.4500 కోట్లకు చేరింది.
రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పులు తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు విధాలుగా అవకాశం కల్పిస్తుంది. ప్రభుత్వ అవసరాల కోసం వేస్ అండ్ మీన్స్ రూపంలో నిధులు తీసుకొవడానికి అవకాశం ఉంటుంది. ఆ పరిమితి కూడా దాటిపోతే ప్రత్యేక డ్రాయింగ్ పద్ధతిలో మరికొంత తీసుకోవచ్చు. అ నిధులు కూడా సరిపోకపోతే ఓవర్ డ్రాఫ్ట్ కింద తీసుకోవచ్చు. ఐతే ఓడీ కూడా అప్పులాంటిదే. ఆర్బీఐ నిర్ణయించిన వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది.
ఇదిలా కొంతకాలంగా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం.. రుణపరిమితి పెంచాలంటూ కేంద్రాన్ని కోరుతూనే ఉంది. ఆర్ధిక మంత్రితో పాటు సీఎస్, ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు కూడా అప్పుల అంశంపై ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసివచ్చారు. సీఎం జగన్ కూడా రుణపరిమితి విషయంలో నిబంధనలు సడలించాలంటూ కేంద్రానికి లేఖరాసినట్లు ప్రచారం జరుగుతోంది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.