RBI on AP Capital: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) సీఎం అయిన వెంటనే తీసుకున్న అతి కీలక నిర్ణయం.. మూడు రాజధానుల ఏర్పాటు. అసెంబ్లీ వేదికగానే ఆయన ప్రకటన చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసమే మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.. అందులో విశాఖ (Visakha)ను పరిపాలనా రాజధానిగా.. అమరావతి (Amaravati)ని శాసన రాజధానిగా.. కర్నూలు (Kurnool) ను న్యాయ రాజధానిగా ఏర్పాటు చేస్తామని ప్రకటించి.. ఆ వెంటనే బిల్లులు కూడా ప్రవేశ పెట్టారు.. ఈ విషయంలో వెనక్కు తగ్గేదే లే అని ప్రభుత్వం పదే పదే చెబుతూ వస్తోంది. రేపో మాపో విశాఖ నుంచే సీఎం జగన్ పాలన మొదలవుతుందనే ప్రచారం ఇప్పటికీ ఉంది. మంత్రులు సైతం పదే పదే ఇదే మాట చెబుతూ వస్తున్నారు. మూడు రాజధనాలు నిర్ణయాన్ని అన్ని విపక్షాలు వ్యతిరేకించాయి.. కోర్టుల్లో కూడా పలుసార్లు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.. ఏపీకి ఏకైక రాజధాని అమరావతే అని అక్కడి రైతులు రెండేళ్లుగా పోరాడుతూనే ఉన్నారు. అయితే ఇటీవల ఏపీ ప్రభుత్వం సడెన్ గా కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకుంది. కానీ అమరావతే ఏపీ రాజధాని అన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు.. మళ్లీ సరకొత్త బిల్లుతో మందుకోస్తాను అంటూ సీఎం జగన్ సందిగ్ధంలో నెట్టేశారు. దీంతో ప్రస్తుతం ఏపీకి రాజధాని ఏది అంటే తెలియని పరిస్థితి..
ఇదే అనుమానాన్ని స్వయంగా రిజర్వ్ బ్యాంక్ వ్యక్తం చేసింది.. ఏపీకి రాజధాని ఎక్కడుందో తెలిస్తే అక్కడే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏపీలో ఆఫీసు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. దానిపై ఆర్బీఐ తాజాగా క్లారిటీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో రిజర్వు బ్యాంకు కార్యాలయం ఏర్పాటు చేయాలంటూ అమరావతి అభివృద్ధి సంస్థ చైర్మన్, అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు గతేడాది అక్టోబరు 12న లేఖ రాశారు. దీనిపై ఆర్బీఐ స్పందించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో సందిగ్ధత ఏర్పడింది.
ఎందుకంటే. మూడురాజధానుల గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఆర్బీఐ అభిప్రాయపడింది. రాజధాని విషయం ప్రభుత్వం నిర్ణయించిన తర్వాతే కార్యాలయం ఏర్పాటు చేస్తామని ఆర్బీఐ డిప్యూటీ మేనేజర్ ఎంకే సుభాశ్రీ ఓ లేఖలో బదులిచ్చారు. నగదు నిల్వలు, సరఫరాకు సంబంధించిన పెట్టెల విషయాన్ని కూడా ఆ లేఖలో ప్రస్తావించారు. ఏపీలో ప్రస్తుతం 104 కరెన్సీ పెట్టెలు ఉన్నాయని తెలిపారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహించే సమావేశాల్లో పెట్టెల కొరతకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని సుభాశ్రీ ఆ లేఖలో వివరించారు. మొత్తం మీద ఆర్ బీ ఐ కార్యాలయం విషయంలో స్పష్టత వచ్చినట్టయింది. ఆర్బీఐ ప్రశ్నకు ఏపీ ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.. అప్పుడు సామాన్య ప్రజలకు కూడా ఏపీ రాజధాని ఏది అన్నది పూర్తి క్లారిటీ వస్తుంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravati, Andhra Pradesh, Ap capital, AP News, Rbi