గల్లంతైన బోటు ఆచూకీ దొరికింది.. వెలికితీతకు తీవ్ర ప్రయత్నాలు..

గోదావరి బోటు గల్లంతులో అధికారులు ముందడుగు వేశారు. గోదావరిలో 214 అడుగుల లోతులో బోటును గుర్తించారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ దళం సోనార్ వ్యవస్థ ద్వారా ఈ బోటు ఆచూకీ కనుగొంది.

news18-telugu
Updated: September 19, 2019, 11:35 AM IST
గల్లంతైన బోటు ఆచూకీ దొరికింది.. వెలికితీతకు తీవ్ర ప్రయత్నాలు..
గోదావరిలో సహాయక చర్యలు (ఫైల్)
  • Share this:
గోదావరి బోటు గల్లంతులో అధికారులు ముందడుగు వేశారు. గోదావరిలో 214 అడుగుల లోతులో బోటును గుర్తించారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ దళం సోనార్ వ్యవస్థ ద్వారా ఈ బోటు ఆచూకీ కనుగొంది. అయితే, వరద నీరు, సుడిగుండాల కారణంగా బోటును బయటికి తీయడం క్లిష్టంగా మారింది. అయినా.. ముంబయ్ మెరైన్ నిపుణుడు సౌరవ్ భక్షి, కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం, మత్స్యకార బృందం ఆధ్వర్యంలో బోటును వెలికి తీసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటి వరకు 34 మృతదేహాలను వెలికితీయగా తాజాగా మరో మృతదేహాన్ని వెలికితీశారు. బోటును బయటికి తీస్తే మిగిలిన మృతదేహాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.
సోనార్ పరికరం ద్వారా బోటును గుర్తించిన అధికారులు

కాగా, ఓ మృతుని జేబులో ఉన్న ఫోన్‌లో జియో సిమ్ నంబరు 6304341457ను అధికారులు గుర్తించారు. పరుశువాడ శ్రీకృష్ణ మోహన్ పేరుతో సిమ్ కార్డ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఫోన్ నెంబర్ ఆధారంగా మృతుడి బంధువులు గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

First published: September 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు