ఆశలు గల్లంతు.. గోదావరిలో దొరకని లాంచీ జాడ..

ఏసీ డెక్‌‌లో ఉన్న వారంతా లోపలే ఉండిపోయి.. చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఆ లాంచీ బయట పడితేనే వారి మృతదేహాలు లభ్యమయ్యే అవకాశముంది.

news18-telugu
Updated: September 16, 2019, 8:35 PM IST
ఆశలు గల్లంతు.. గోదావరిలో దొరకని లాంచీ జాడ..
గోదావరిలో సహాయక చర్యలు
news18-telugu
Updated: September 16, 2019, 8:35 PM IST
గంటలు గడుస్తున్నాయి. ఆశలు సన్నగిల్లుతున్నాయి. గోదావరిలో మునిగిన..లాంచీ జాడ ఇంకా దొరకలేదు. గల్లైంతైన వారికి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, నేవీ, గజ ఈతగాళ్లు ఉదయం నుంచి గాలిస్తున్నా ఫలితం లేదు. ఇవాళ నాలుగు మృతదేహాలు మాత్రమే బయటపడ్డాయి. దాంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 12కి చేరింది. మిగిలిన వారి గురించి ఇంకా ఎలాంటి సమాచారం దొరకలేదు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు, బంధువుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తమ వారు బతికి ఉండే అవకాశమే లేదని తెలిసినా.. కనీసం మృతదేహాలనైనా దొరకుతాయా? లేదా? అని విలపిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండల కచ్చులూరు వద్ద గోదావరి నదిలో రెండో సహాయక చర్యలు నిలిచిపోయాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ ఆగిపోయింది. రేపు ఉదయం నుంచి ప్రారంభిస్తారు. గల్లైంతన వారిలో చాలా మంది బోటు అండర్ డెక్కులో చిక్కుకుపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అది ఏసీ డెక్ కావడంతో బయటకు వచ్చేందుకు వీలు పడదు. ఈ నేపథ్యంలో అందులో ఉన్న వారంతా లోపలే ఉండిపోయి.. చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఆ లాంచీ బయట పడితేనే వారి మృతదేహాలు లభ్యమయ్యే అవకాశముంది. దాంతో అధునాతన టెక్నాలజీని ఉపయోగించి బోటును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు గల్లైంతన వారి మృతదేహాలు ధవళేశ్వరం వద్దకు కొట్టుకుపోయే అవకాశం ఉండడంతో బ్యారేజీ వద్ద వలలు ఏర్పాటు చేశారు. డైవర్లు, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. కాగా, ఆదివారం 73 మంది పాపికొండలు యాత్రకు బయలుదేరిన లాంచీ దేవీపట్నం మండలం కచ్చూలూరు వద్ద గోదావరి నదిలో మునిగిపోయింది. బోటులో 64 మంది పర్యాటకులు, 9 మంది బోటు సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకు 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. 12 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 35 మంది గల్లంతవగా.. వారి ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదు.

First published: September 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...