హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: ఆలయాలపై దాడులు.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం

Andhra Pradesh: ఆలయాలపై దాడులు.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం

సీఎం జగన్ (ఫైల్ ఫోటో)

సీఎం జగన్ (ఫైల్ ఫోటో)

Andhra Pradesh: మత సామరస్యం దెబ్బతినేలా చేస్తున్న పరిస్థితులు ఇబ్బందులు కలిగిస్తున్నాయని... అందుకే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తూ జీఓ నెంబర్ 6 విడుదల చేశామని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు.

  ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలను జగన్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇక భవిష్యత్తులో ఇలాంటివి పునారవృతం కాకుండా చూసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో మత సామరస్య కమిటీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ నేతృత్వంలో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నారు. 20 మంది సభ్యులుండే ఈ కమిటీలో హోం, దేవాదాయ, మైనార్టీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులుగా ఉంటారు. రాష్ట్ర కమిటీలో సభ్యుడిగా సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఉంటారు. రాష్ట్ర కమిటీలో సభ్యులుగా అన్ని మతాలకు చెందిన ఒక్కో ప్రతినిధి ఉంటారని ఉత్తర్వులో పేర్కొన్నారు. కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

  వరుసగా జరుగుతున్న ఘటనల వల్ల రాష్ట్ర ప్రతిష్ట దిగజారుతుందని ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ అన్నారు. మత సామరస్యం దెబ్బతినేలా చేస్తున్న పరిస్థితులు ఇబ్బందులు కలిగిస్తున్నాయని... అందుకే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తూ జీఓ నెంబర్ 6 విడుదల చేశామని తెలిపారు. అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్న శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఈ కమిటీలు మత సామరస్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తాయని... ఈ కమిటీలకు ఎలాంటి కాల పరిమితి లేదని వెల్లడించారు. జరిగిన దాడుల వెనుక లోతైన కుట్ర ఉందని అన్నారు.

  ఇలాంటి వాటిని చేధించాలంటే అధికారులు పోలీసులు, మత పెద్దలు అందరికి బాధ్యత ఉండాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ అన్నారు. ఈ తరహా నేరాలు జరిగినప్పుడు అక్రమాలకు పాల్పడిన వ్యక్తులు తప్పించుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని, శాంతిని దెబ్బ తీయాలని చూస్తున్నారని.. అందుకే ఈ తరహా కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర స్ధాయి కమిటీకి సీఎస్ చైర్మన్‌గా.. డీజీపీ వైస్ చైర్మన్‌గా... అన్ని మతాల ‌నుంచి ఒక్కొక్కరు మెంబర్‌గా... హోం ప్రిన్సిపల్ సెక్రటరీ, దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ, మైనార్టీ వెల్ ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. జిల్లా స్ధాయిలో కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారని సీఎస్ స్పష్టం చేశారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP Temple Vandalism

  ఉత్తమ కథలు