రేషన్ కార్డులపై మత ప్రచారం... ఏపీలో మరో దుమారం...

ఆంధ్రప్రదేశ్‌లో మరో దుమారం రేగింది. రేషన్ కార్డులపై మత ప్రచారం చేస్తున్న ఫొటోలు వైరల్‌గా మారాయి.

news18-telugu
Updated: December 8, 2019, 9:36 PM IST
రేషన్ కార్డులపై మత ప్రచారం... ఏపీలో మరో దుమారం...
రేషన్ కార్డుపై మత ప్రచారానికి సంబంధించి వైరల్ అవుతున్న ఫొటో
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో మరో దుమారం రేగింది. రేషన్ కార్డులపై మత ప్రచారం చేస్తున్న ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలో వడ్లమూరు అని ఉంది. రేషన్ డీలర్ పేరు పక్కన ఎం.మంగాదేవి, ఎం.సత్యసాయిరాం అని ఉంది. షాప్ నెంబర్ 034 అని ఉంది. వడ్లమూరు అనేది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో మతమార్పిడులు ఎక్కువ అయ్యాయని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. తాజాగా విజయవాడలో బహిరంగంగానే మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో మరోసారి మత ప్రచారం అంశం, అది కూడా పేదలకు ఇచ్చే రేషన్ కార్డుల మీద ఇలాంటి ప్రచారం చేయడం వివాదాస్పదంగా మారింది. ఇదే రేషన్ డీలర్ కొన్ని వెంకటేశ్వరస్వామి ఫొటోలను కూడా రేషన్ కార్డుల మీద ముద్రించారని తెలిసింది.

First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>