Home /News /andhra-pradesh /

RELA MOTHER LOVE WHEN SHE HEARD HER SON NO MORE AFTER SOME DAY SHE ALSO DIED NGS VZM

Andhra Pradesh: అమ్మ ప్రేమ అంటే ఇదే.. కొడుకు కోసం ఆగిన తల్లి గుండె..

కొడుకు మరణాన్ని తట్టుకోలేక ఆగిన తల్లి గుండె

కొడుకు మరణాన్ని తట్టుకోలేక ఆగిన తల్లి గుండె

బతికి ఉన్నంత వరకు తన పిల్లల కోసం ప్రాణం పెడుతుంది అమ్మ.. కన్న బిడ్డల కోసం దేనినైనా ఎదిరించేంది అమ్మ ప్రేమ ఒక్కటే.. చనిపోయిన తరువాత కూడా బిడ్డకు తోడుగా ఉండాలి అనుకుంది ఓ అమ్మ.. మాయదారి రోగంతో బిడ్డ చనిపోతే.. ఈ లోకంతో నాకేం పని.. నా కొడుకు దగ్గరకే వెళ్తున్నా అంటూ ఆ అమ్మ గుండె కూడా ఆగింది..

ఇంకా చదవండి ...
    తన చిన్నారి చిట్టి పొట్టి మాటలు వింటూ ఆ తల్లి మురిసిపోయింది. బిడ్డ భవిష్యత్తు పై ఎన్నో కలలు కంది. కంటికి రెప్పలా కాపాడుకున్న తన బిడ్డకు సుస్తీ చేస్తే.. ఆ పసి ప్రాణాన్ని కాపాడుకోడానికి అనేక ఆసుపత్రులకు తిప్పింది. కనిపించిన దేవుళ్లందరికీ మొక్కింది. బిడ్డని బతికించుకోవడానికి ఆ తల్లి చేయని ప్రయత్నం అంటూ లేదు.. అయినా విధికి అమ్మ ప్రేమపై కన్ను కట్టునట్టు ఉంది. ఏ మాత్రం కనికరం లేకుండా చిన్నారి ప్రాణాలు తీసేసింది. తన కొడుకు లేని జీవితం ఇక తనకెందుకు అనుకున్న ఆ అమ్మ గుండెలవిసేలా ఏడ్చింది. చివకిరి బాబు వెంట తోడుగా వెళ్తూ ప్రాణాలు విడిచింది. బాబులేని లోకంలో తాను ఉండలేనంటూ ఏడుస్తూనే ప్రాణాలు విడిచి పెట్టింది. ఆడుతూ పాడుతూ కళ్ళముందు కదలాడిన నాలుగేళ్ల పిల్లాడిని సికిల్ సెల్ అనే ఓ మాయదారి రోగం పీడించింది. రోజుల తరబడి మంచానికే పరిమితం చేసింది. ఎందరు వైద్యులకు చూపించినా ఫలితం లేకపోవడంతో కన్నపేగు తరుక్కు పోయింది. రోజురోజుకూ నీరసించిన.. ఆ చిన్న ప్రాణం ఈ లోకాన్ని వదిలేసి వెళ్లి పోయింది. ఒడిలో ఒదిగి పోవాల్సిన కొడుకు లేకపోవడం, రోజులు తరబడి తిండి, నిద్ర లేకపోవడంతో సత్తువ కోల్పోయిన ఆ తల్లి ఊపిరి కూడా ఆగిపోయింది.

    ఈ హృదయ విదారక ఘటన కొమరాడ మండలం కోటిపాం గ్రామంలో చోటు చేసుకుంది. కోటిపాం గ్రామానికి చెందిన నాగరాజు, జ్యోతి రోజువారీ కూలీలుగా పని చేస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు సాహిత్ కుమార్ (4) కొద్దిరోజులుగా సికిల్ సెల్ అనే అంతు చిక్కని వ్యాధితో పుట్టినప్పటి నుంచి బాధపడుతున్నాడు. ఆ మాయదారి రోగం నుండి తమ బిడ్డను కాపాడుకునేందుకు.. పార్వతీపురం ఏరియా ఆసుపత్రి సహా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలలోని పలు ఆసుపత్రులకు తీసుకెళ్లారు.  వైద్యం అందించారు. కొద్ది రోజులు సాహిత్ ను విశాఖలోని కేజీహెచ్ కు తీసుకెళ్లి కూడా చూపించారు.కానీ ఫలితం లేకపోవడంతో పది రోజుల కిందట.. ఇంటికి తీసుకు వచ్చేసారు.

    కొద్ది రోజులుగా సాహిత్  కుమార్ ఇంటివద్ద తీవ్ర జ్వరంతో బాధపడుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. తను బిడ్డ నుంచి కాపాడుకునేందుకు ప్రయత్నించిన తల్లి.. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక.. ఆ తల్లి కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. గత కొన్ని రోజులుగా తిండి, కంటినిండా నిద్ర లేకపోవడంతో ఆ కన్నతల్లి తట్టుకోలేక పోయింది. షుగర్ లెవెల్స్ పడిపోవడంతో కూర్చున్న చోటే కూలబడిపోయింది. దీంతో.. ఆ తల్లిని ఆసుపత్రికి తీసుకొని వెళ్లగా.. చికిత్స పొందుతూ బుధవారం ప్రాణాలు వదిలేసింది.తన కొడుకు చనిపోయాడన్న బాధతో గంటల వ్యవధిలోనే ఆ తల్లి కూడా ప్రాణాలు వదిలేసింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బోరున విలపించారు. ఒకే రోజు వ్యవధిలోనే.. తల్లీ కొడుకులు దూరం కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Vizianagaram

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు