హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

కరోనా ఎఫెక్ట్.. ఆర్టీసీ ఆదాయం డీజిల్‌కు సరిపోట్లే..

కరోనా ఎఫెక్ట్.. ఆర్టీసీ ఆదాయం డీజిల్‌కు సరిపోట్లే..

ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

కరోనా సోకకుండా ఆర్టీసీ సిబ్బంది రక్షణకు చర్యలు తీసుకోవాలి. కరోనా సోకిన ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన చికిత్స అందించాలి. అవసరాల మేరకు బస్సుల తగ్గింపు, పెంపుపై సమీక్షించాలి.

    కరోనా వైరస్ మహమ్మారి ఇప్పట్లో తగ్గిపోయే సూచనలు కన్పించడం లేదు. రోజురోజూకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల అన్నిరంగాలపై ప్రభావం తీవ్రంగా పడింది. ప్రజారవాణా నేటికీ వైరస్ ప్రభావం నుంచి కోలుకోలేని పరిస్థితి. అందులో భాగంగానే ఏపీఎస్ ఆర్టీసీపై తీవ్ర ప్రభావం పడింది. లాక్‌డౌన్ నిబంధనలకు సడలింపులు ఇచ్చినప్పటికీ ఆర్టీసీ బస్సులు పూర్తిస్థాయిలో రోడ్డెక్కడం లేదు. ఇప్పటివరకు కేవలం 30 శాతం బస్సులే రోడ్డెక్కాయి. రోడ్డెక్కిన బస్సుల్లోనూ ప్రయాణికులు ఎవరూ ఎక్కడం లేదు. దీంతో ప్రస్తుతం రోడ్లపై తిరుగుతున్న బస్సుల డీజిల్ ఖర్చులకు సరిపడా ఆదాయం రావట్లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్టీసీ ఆర్‌ఎంలతో ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆర్టీసీ సిబ్బందిపై కరోనా ప్రభావం, వైరస్‌ వ్యాప్తి, ఆర్టీసీ పరిస్థితి, ప్రజలకు సేవలు అందిస్తూనే సంస్థ ఆదాయం పెంచుకునే మార్గాలపై చర్చించారు.

    ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు మాట్లాడుతూ.. ‘మే 21 నుంచి 30 శాతం బస్సులే నడుస్తున్నాయి. కరోనా భయంతో ఆర్టీసీ ఆదాయం బాగా తగ్గింది. ప్రస్తుతం వచ్చే ఆదాయం డీజిల్‌ ఖర్చుకే సరిపోతోంది. కరోనా సోకకుండా ఆర్టీసీ సిబ్బంది రక్షణకు చర్యలు తీసుకోవాలి. కరోనా సోకిన ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన చికిత్స అందించాలి. అవసరాల మేరకు బస్సుల తగ్గింపు, పెంపుపై సమీక్షించాలి. కరోనా వల్ల తగ్గిన ఆదాయాన్ని ప్రత్యామ్నాయ మార్గాల్లో భర్తీ చేయాలి. సరకు రవాణాతో ఆదాయం భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలి. బస్టాండ్ల పరిశుభ్రత, ప్రయాణికుల సౌకర్యాలపై మరింత దృష్టి పెట్టాలి’ అని జిల్లాల ఆర్‌ఎంలకు ఎండీ కృష్ణబాబు దిశానిర్దేశం చేశారు.

    Published by:Anil
    First published:

    Tags: Andhra Pradesh, Apsrtc, Rtc

    ఉత్తమ కథలు