• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • REASON BEHIND HOUSING LANDS DISTRIBUTION FOR POOR POSTPONEMENT IN ANDHRA PRADESH AK PRN

AP House Sites: పట్టాల పంపిణీ జరిగేనా..? ఆ పార్టీ నేతలు కావాలనే అడ్డుకుంటున్నారా..?

AP House Sites: పట్టాల పంపిణీ జరిగేనా..? ఆ పార్టీ నేతలు కావాలనే అడ్డుకుంటున్నారా..?

ప్రతీకాత్మక చిత్రం

AP Housing Lands For Poor: ప్రభుత్వం కొన్ని నివాసయోగ్యం కాని భూములను ఎంపిక చేయడంతో అనువుగా ఉన్న భూములు కూడా వివాదంలో చిక్కుకున్నాయన్న విమర్శలు వస్తున్నాయి.

  • Share this:
    రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా సాగుతున్న అంశం పేదలకు ఇళ్ల పట్టాలు. 6 నెలలుగా వాయిదా పట్టాల పంపిణీ వాయిదా పడుతూ వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సొంతఇళ్లు లేని పేదలను గుర్తించిన ప్రభుత్వం వాటిని పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తూ వస్తోంది. డిసెంబర్ 25న 30 లక్షల 66 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 68వేల 677 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. వీటి మార్కెట్ విలువ రూ.23,535 కోట్లు. ఐతే ప్రతిపక్షం వేసిన కోర్టు కేసుల కారణంగా వాయిదా పడుతోంది.

    టీడీపీ నేతలు వేసిన కేసుల్లో కొన్ని వివాదాస్పద, నివాసయోగ్యం కాని భూములున్నప్పటికీ కొన్ని మాత్రం కావాలనే అడ్డుకుంటున్నారా అని ఒకింత అనుమానం కలించేలా ఉన్నాయి. రాష్ట్రంలో పేదల ఇళ్ల స్థలాలపై కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు అన్ని జిల్లాలకు సంబంధించి కోర్టులో కేసులున్నాయి. రాజమండ్రి ఆవ భూములు, నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ భూముల విషయంలో వివాదాలు నెలకొన్నా.. రెండు జిల్లాల్లో మాత్రం ప్రతిపక్ష నేతల ఫిర్యాదులు ఒకింత అనుమానాస్పదంగానే ఉన్నాయి.

    ఉదాహరణకు ప్రకాశం జిల్లా ఒంగోలులో పేదల ఇళ్ల స్థలాలకు ఇవ్వాల్సిన స్థలాలు మైనింగ్ భూములంటూ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు కోర్టులో పిటిషన్ వేశారు. కనిగిరి-పామూరు మధ్యలో చంద్రశేఖరపురంలో పేదల ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం భూములను గుర్తించింది. ఐతే మైనింగ్ భూముల్లో స్థలాలిస్తున్నారని సదరు మాజీ ఎమ్మెల్యే తన అనుచరుడితో పిటిషన్ వేయించారు. నిజానికి అవే భూముల్లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయాల్సిందిగా 2016లో స్వయంగా ఆయనే కలెక్టర్ కు లేఖ రాశారు. ప్రస్తుతం దీనిపై కోర్టు స్టే ఇచ్చింది. ఒకప్పుడు ట్రిపుల్ ఐటీకి ఏర్పాటు చేయాలని చెప్పిన భూములు ఇప్పుడు ఇళ్లస్థలాలకు పనికిరాకుండా పోయాయా? అంటూ అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

    ఇక తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడలోనూ ఇదే తరహాలో ఇళ్ల స్థలాల పంపిణీకి అడ్డుకట్టపడినట్లు తెలుస్తోంది. కాకినాడ పోర్టు నుంచి ఉప్పాడ వెళ్లే మార్గంలోనూ పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఐతే దీనిపై కాకినాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే అనుచరుడు పిటిషన్ వేశారు. ఆ భూములు మడ అడవులకు చెందిన భూములను.. ప్రభుత్వం అటవీ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో సదరు భూములపైనా కోర్టు స్టే ఇచ్చింది. నిజానికి అవి ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో ఉన్నాయి.

    ఇక అమరావతి ప్రాంతంలో పేదలకు ఇల్లు ఇస్తే డెమోగ్రాఫిక్ ఇన్ బ్యాలెన్స్( కులాలు వర్గాలు సమీకరణ మారిపోతుంది) అంటూ టీడీపీ పిటిషన్ వేస్తే కోర్టు స్టే ఇచ్చింది. అక్కడ పేదలకు ఇళ్లు ఇస్తే కులాలు మారిపోవడం ఏమిటో టీడీపీ నేతలే చెప్పాలని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

    ప్రభుత్వం కొన్ని నివాసయోగ్యం కాని భూములను ఎంపిక చేయడంతో అనువుగా ఉన్న భూములు కూడా వివాదంలో చిక్కుకున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. సమస్యాత్మక భూముల అంశాన్ని ఆసరాగా తీసుకున్న ప్రతిపక్ష నాయకులు అసలుకే ఎసరు పెట్టారని అధికార పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. మొత్తానికి వైసీపీ-టీడీపీల మధ్య ఆధిపత్య పోరుతో ఇళ్లస్థలాల కోసం పేదలు పడిగాపులు కాయాల్సి వస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు