ఏపీ ప్రభుత్వంతో టాలీవుడ్ పెద్దల భేటీ ఎప్పుడు జరుగుతుందనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఏపీ ప్రభుత్వం నుంచి తమకు ఆహ్వానం వచ్చిందని టాలీవుడ్ పెద్దలు నుంచి ప్రకటన వచ్చినప్పటికీ.. ఈ భేటీ మాత్రం ఇంకా జరగలేదు. ఆగస్టు నెలాఖరులోనే ఈ భేటీ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఆ తరువాత ఈ నెల మొదటి వారంలో మీటింగ్ కచ్చితంగా జరుగుతుందని భావించారు. కానీ సెప్టెంబర్‌లో రెండు వారాలు గడుస్తున్నా.. సీఎం జగన్‌తో టాలీవుడ్ పెద్దల భేటీకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేదు. అటు ప్రభుత్వం నుంచి ఇటు టాలీవుడ్ నుంచి ఇంతవరకు దీని గురించి ఎవరూ మాట్లాడటం లేదు. దీంతో అసలు సీఎం జగన్‌తో టాలీవుడ్ పెద్దల భేటీ ఉంటుందా లేదా అనే చర్చ జరుగుతోంది. అయితే టాలీవుడ్‌పై సీఎం జగన్ అసంతృప్తితో ఉన్నారనే చర్చ మొదలైంది. ఇందుకు ప్రత్యేకమైన కారణం కూడా ఉందనే టాక్ వినిపిస్తోంది.
ఆ మధ్య ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ పెద్దలను చర్చలకు ఆహ్వానించిందనే వార్తలు వచ్చాయి. దీన్ని టాలీవుడ్ పెద్దలు కూడా ధృవీకరించారు. అయితే వాస్తవానికి టాలీవుడ్ పెద్దలే సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు సీఎం జగన్ అపాయింట్‌మెంట్ అడిగారట. తాము సీఎం జగన్‌ను కలిసేందుకు సమయం కోరామని చెప్పకుండా.. ఏపీ ప్రభుత్వమే టాలీవుడ్ పెద్దలను చర్చలకు కోసం పిలిచిందనే విధంగా టాలీవుడ్ పెద్దలు చెప్పడం ఏపీ ప్రభుత్వానికి నచ్చలేదట. ఈ అంశమే సీఎం జగన్‌కు టాలీవుడ్‌పై అసంతృప్తి పెరగడానికి కారణమైందనే వాదన కూడా ఉంది. అందుకే టాలీవుడ్ పెద్దలకు సీఎం జగన్ అపాయింట్‌మెంట్ దొరకడం లేదనే ఊహాగానాలు మొదలయ్యాయి.
Sleep: నగ్నంగా పడుకోవడం వల్ల ఎన్నో లాభాలు.. చాలా సమస్యలకు పరిష్కారం.. అవేంటో తెలుసుకోండి
Revanth Reddy: కాంగ్రెస్ ముఖ్యనేత కీలక వ్యాఖ్యలు.. రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్
అయితే సీఎం జగన్‌తో టాలీవుడ్ పెద్దల భేటీకి ఇతరత్రా ప్రత్యేకమైన కారణాలేమీ లేవని.. కేవలం కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా ఇలా జరుగుతోందనే టాక్ కూడా వినిపిస్తోంది. టాలీవుడ్ పెద్దలు ఈ విషయాన్ని గ్రహించి సీఎం జగన్‌తో చర్చించేందుకు సమయం కావాలని కోరుతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి సీఎం జగన్‌తో టాలీవుడ్ పెద్దల భేటీ వాయిదా వెనుక ప్రత్యేకమైన కారణం ఉందా ? లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.