హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీ తెలంగాణ మధ్య బస్సులు నడిచేది అప్పుడే..

ఏపీ తెలంగాణ మధ్య బస్సులు నడిచేది అప్పుడే..

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారుల కమిటీ మార్గదర్శకాలు రూపొందించింది. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఆమోదం తెలిపారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారుల కమిటీ మార్గదర్శకాలు రూపొందించింది. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఆమోదం తెలిపారు.

ఏపీతో కొన్ని సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నందున వాటిపై స్పష్టత కోసం తెలంగాణ అధికారులు వేచి చూస్తున్నారు.

  లాక్‌డౌన్ కారణంగా ఏపీ, తెలంగాణ మధ్య నిలిచిపోయిన బస్సు సర్వీసులను పునరుద్ధరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఏపీతో పాటు కర్ణాటకకు బస్సుల సర్వీసులను ప్రారంభించాలని ఆర్టీసీ యోచిస్తోంది. ఇందుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకోసం ఇప్పటికే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల రోడ్డు రవాణాశాఖలకు తెలంగాణ ఆర్టీసీ లేఖలు రాసింది. కర్ణాటకలో ప్రధానంగా బెంగుళూరు, రాయిచూరుకు తెలంగాణ నుంచి ఎక్కువ బస్సు సర్వీసులు నడుస్తాయి. కర్ణాటకకు సంబంధించి సాంకేతిక ఇబ్బందులు లేవు. అక్కడి రోడ్డు రవాణాశాఖ నుంచి సుముఖత వ్యక్తంకాగానే బస్సులు పునరుద్ధరిస్తారు.

  అయితే ఏపీతో కొన్ని సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నందున వాటిపై స్పష్టత కోసం అధికారులు వేచి చూస్తున్నారు. మొన్నటి వరకు ఏపీ బస్సులు మన రాష్ట్రంలో 900కిలో మీటర్ల మేర నడుస్తుండగా తెలంగాణ సర్వీసులు 700 కిలోమీటర్లే తిరుగుతున్నాయి. వ్యత్యాసం లేకుండా రెండువైపులా సమానంగా బస్సు సర్వీసులు నడుపాలని, దీనిపై ఒప్పందం తర్వాతే సర్వీసులను పునరుద్ధరించాలని సీఎం కేసీఆర్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎంత మేర సర్వీసులు పెంచాలనే దానిపై అధికారులు ఉన్నతస్థాయిలో చర్చలు జరపనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వంతోనూ చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Apsrtc, Rtc, Telangana, Tsrtc

  ఉత్తమ కథలు