REAL ESTATE BUSINESS FACING HUGE LOSSES AFTER AP GOVERNMENT DECISION FULL DERAILS HERE PRN GNT
Real Estate in AP: ఏపీలో రియల్ ఢమాల్.. సర్కార్ నిర్ణయంతో చిక్కులు.., మొదటికే మోసం వస్తుందా..?
(ప్రతీకాత్మకచిత్రం)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం మొత్తం రియల్ ఎస్టేట్ (Real Estate Business) రంగాన్నే అతలాకుతలం చేసింది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చినా, లేదా నివాస స్థలములుగా మార్చాలన్నా డిపార్ట్మెంట్ ఆఫ్ కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ (D.T.C.P) నుండి తప్పని సరిగా అనుమతి తీసుకోవలసి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం మొత్తం రియల్ ఎస్టేట్ (Real Estate Business) రంగాన్నే అతలాకుతలం చేసింది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చినా, లేదా నివాస స్థలములుగా మార్చాలన్నా డిపార్ట్మెంట్ ఆఫ్ కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ (D.T.C.P) నుండి తప్పని సరిగా అనుమతి తీసుకోవలసి ఉంటుంది. నిబంధనల ప్రకారం లే అవుట్ వేసినప్పుడు ఆ ప్రాంతంలో నివాసం ఉండేవారికి మరియు చుట్టుప్రక్కల వారికి ప్రస్తుత మరియు భవిష్యత్ అవసరాల నిమిత్తం ప్రభుత్వం కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసింది. దీని ప్రకారం ఏదైనా స్థలములో లే అవుట్ వెయ్యాలి అంటే ఆ స్థలం విస్థీరణం కనీసం ఒక హెక్టార్ విస్తీర్ణంలో ఉండాలి. లే అవుట్ విస్థీరణమును బట్టి రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, విద్యుత్ సరఫరా వంటి అవసరాల నిమిత్తం నిర్ధేశిత స్థలములో 20% స్థలాన్ని కేటాయించడంతో పాటు పార్కులు, స్కూల్ భవనాలు, దేవాలయం, రిక్రియేషన్ క్లబ్ వంటి వాటి నిర్మాణం కోసం 15% స్థలం సంభంధిత అధారిటీకి తనఖా పెట్టాలనే నిబంధన ఏపీ టీసీపీ యాక్ట్ 2017లో ఉంది.
ఐతే ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన జిల్లాలు, పెరిగిన నివాస అవసరాల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా ఇబ్బడి ముబ్బడిగా రియల్ వెంచర్లు వెలిశాయి. వీటిలో నూటికి తొంభై తొమ్మిది శాతం వెంచర్లు అనధికారికంగానే వెలిశాయనేది జగమెరిగిన సత్యం. దీనిలో అధికార పార్టీ నేతల నుండి ప్రభుత్వ అధికారుల వరకు అందరి ప్రమేయం ఉందనేది బహిరంగ రహస్యం. చాలా వరకు వెంచర్ల నిర్వాహకులకు అధికారపార్టీ అండదండలతో పాటు భారీ మొత్తాలలో ముడుపులు అందుకుంటున్నారనేదాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రెండు నెలల క్రితం జగన్ ప్రభుత్వం 2020 తర్వాత ఏర్పడిన వెంచర్లకు డీ.టీ.సీ.పీ అనుమతులు తప్పనిసరి చేయడంతో పాటు అనుమతులు లేని వెంచర్లలోని ఫ్లాట్లను రిజిష్ట్రేషన్ చేయటంపై నిషేధం విధించారు. ప్రభుత్వ ఆదేశాలు కాదని ఎవరైనా రిజిష్ట్రేషన్ చేసినట్లైతే సదరు సబ్ రిజిస్ట్రార్ పై కఠినచర్యలు తీసుకోవటమే కాక విధుల తొలగిస్తామని కూడా హెచ్చరించింది. దీంతో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైంది. ఎంతోమంది వ్యాపారులు అనేక విధాలుగా లాబీయింగ్ చేసినా వ్యవహారం కొలిక్కిరాలేదు. దీంతో అటు రియల్ వ్యాపారం కుదేలవడంతో పాటు రాష్ట్ర ఖజానాకి దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయల మేర రిజిష్ట్రేషన్ శాఖ నుండి రావలసిన ఆదాయానికి గండి పడిందని ఒక అంచనా.
అసలే ఆర్ధిక కష్టాలతో ఉన్న రాష్ట్రంలో డిటిసిపి నిబంధన వల్ల ప్రభుత్వానికి సుమారు ఐదువేల ఎకరాల వరకు ల్యాండ్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉందని.., దీనంతటినీ చూపించి మరింత అప్పు తేచ్చుకోవచ్చనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన కావచ్చని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వ ఆలోచన ఎలా వున్నా భారీ లాభాలకు ఆశపడి నేతలకు కొంత,అధికారులకు మరికొంత ముట్టజెప్పి అధిక ధరలకు పొలాలు కొని వాటి అభివృద్ధికి భారీగా ఖర్ఛు చేసి ఇప్పుడు ఒక్కసారిగా నిబంధనల పేరుతో తమను ఇబ్బంది పెట్టడం ఏంటని రియల్ వ్యాపారులు స్థానిక నేతలను నిలదీస్తున్నారు. రోజు రోజుకు పేరుగుతున్న ఒత్తిడి తట్టుకొలేక అధికారపార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల పార్టీకి కష్టపడి పని చేసిన తమకి ఆర్ధికంగా ఇబ్బందులు ఏర్పడటమే కాక, అటు ప్రభుత్వ ఖజానాకి భారీగా గండి పడుతుందని.., ఇప్పటికే ఆస్థి విలువ, రిజిష్ట్రేషన్ ఛార్జీలు రెండు సార్లు పెంచడంతో తమ వ్యాపారం అంతంత మాత్రంగా ఉందని ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు డి.టి.సి.పి అనుమతుల విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోక పోతే రాబోవు ఎన్నికలలో తమ సత్తా ఏంటో తెలిసొచ్చేలా చేస్తామంటున్నారు రియల్ వ్యాపారులు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.