రేషన్ కార్డు లేని కరోనా రోగులకూ ఆరోగ్య శ్రీ... ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫీజులు ఫిక్స్..

YSR Arogya sri | రేషన్ కార్డు లేని కరోనా రోగులు (కరోనా లక్షణాలు ఉన్నవారు, లక్షణాలు లేకపోయినా కరోనా సోకినవారు)ని ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

news18-telugu
Updated: July 8, 2020, 9:44 PM IST
రేషన్ కార్డు లేని కరోనా రోగులకూ ఆరోగ్య శ్రీ... ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫీజులు ఫిక్స్..
సీఎం జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచాన్ని వణికిస్తూ ప్రజలను భయపెడుతున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి భయపడుతున్న వారికి భరోసా ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రేషన్ కార్డు లేని కరోనా రోగులు (కరోనా లక్షణాలు ఉన్నవారు, లక్షణాలు లేకపోయినా కరోనా సోకినవారు)ని ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాటు, ప్రైవేట్ ఆస్పత్రుల సేవలు కూడా తీసుకోవాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా బాధితుల చికిత్సకు ఆరోగ్య శ్రీ కింత ఎంత డబ్బులు చెల్లించాలనే అంశంపై పలుసూచనలు చేసింది. ఆ సూచనల ప్రకారం విషమంగా లేని పేషెంట్లకు రోజుకు రూ.3250 ప్రభుత్వం చెల్లిస్తుంది. విషమంగా ఉన్న పేషెంట్లకు వారికి అందించే వివిధ రకాల చికిత్సలకు వివిధ రుసుములు చెల్లిస్తుంది.

వెంటిలేటర్ లేకుండా ఐసీయూలో ఉంచితే రోజుకు రూ.5480

ఐసీయూలో ఎన్ఐవీ పెడితే రోజుకు రూ.5980
ఐసీయూలో వెంటిలేటర్ పెడితే రోజుకు రూ.9580
వెంటిలేటర్ లేకుండా SEPSIS రోజుకు రూ.6280
వెంటిలేటర్‌తో కూడిన SEPSIS రోజుకు రూ.10,380

ఏపీలో ఆరోగ్య శ్రీ కింద ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు చెల్లించే ఫీజు
Published by: Ashok Kumar Bonepalli
First published: July 8, 2020, 9:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading