Home /News /andhra-pradesh /

RARE KING COBRA IFIRST TIME SAW FOREST OFFICIALS ANDHRA PRADESH AT VIZIANAGARAM DISTRICT NGS VZM

King Cobra: అరుదైన కింగ్ కోబ్రాను చూసి హడలిపోయిన అధికారులు.. ఎక్కడంటే..?

అరుదైన కింగ్ కోబ్రా

అరుదైన కింగ్ కోబ్రా

ఓ అరుదైన కింగ్ కోబ్రా హల్ చల్ చేసింది. ఇలాంటి కింగ్ కోబ్రా తొలిసారి కనిపించింది.. అది భయపెట్టేలా బుసలు కొడుకుతుండడంతో అధికారులు సైతం హడలెత్తిపోయారు.

    కింగ్ కోబ్రా(kinh cobra) ఈ పేరు వింటేనే చాలు ఎవరైనా భయపడతారు. వాటి దరిదాపుల్లో కూడా ఉండకుండా పరుగులు తీస్తారు. సాధారణంగా అంటార్కిటికా మినహా ప్రపంచమంతా పాములు విస్తరించిన సంగతి తెలిసిందే. సుమారు 2900 జాతులు పాముల్లో (sankes) ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటిల్లో చాలావరకు విషపూరితమైనవి కాగా.. అవి ఒక్క కాటుతోనే ఏ జంతువునైనా గంటల్లో మృత్యువు ఒడికి చేర్చగలవు. ఇదిలా ఉంటే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని అరుదైన నాగుపాము కంటబడింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. విజయనగరం జిల్లాలో పార్వతీపురం మండలం చందలంగి అటవీ ప్రాంతంలో కింగ్ కోబ్రా హల్‌చల్ చేసింది. గత కొంత కాలంగా చందలంగి అటవీ ప్రాంతంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తుండటంతో అటవీశాఖ అధికారులు వాటిని వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నాల్లో ఉన్నారు. రోజులాగే ఏనుగుల కోసం అంతా వెళ్లారు. అక్కడ ఉన్న ఏనుగులనుగిరిజన గ్రామాల నుంచి అటవీ ప్రాంతంలోకి  తరిమేయడానికి ప్రయత్నిస్తుండగా.. కింగ్ కోబ్రా పిల్ల  పడగ ఎత్తి ఒక్కసారి బుసలు కొట్టింది. దీంతో అటవీ శాఖ అధికారులు ఒక్కసారిగా హడలిపోయారు. ఇన్నాళ్లూ ఈ అటవీ ప్రాంతంలో కింగ్ కోబ్రా లేదని తాము అనుకుంటున్నామని.. అయితే చందలంగి అటవీ ప్రాంతంలో కింగ్ కోబ్రా ఉందని చెప్పుకొచ్చారు. ఇది చిన్న కింగ్ కోబ్రా అని.. దీని తల్లి కూడా ఇక్కడే ఉండి ఉంటుందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. కాసేపు ఆ దగ్గర్లో ఏమైనా కోబ్రాలు ఉన్నాయా అని గాలించారు.

    ఈ గిరినాగులు ఎవరికీ హాని చేయవని.. ఎవరూ కంగారుపడాల్సిన పని లేదని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. తొందరపడి ఆ పాములను చంపడం కానీ హింసించడం కానీ చేయవద్దని స్థానిక ప్రజలను కోరారు. ఎవరికైనా ఇలాంటి సర్ప జాతులు కనబడితే వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అటవీ ప్రాంతంలో తిరిగే కింగ్ కోబ్రాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    ఇదీ చదవండి: నేడు ఇంజినీరింగ్ ఎంసెట్ ఫలితాలు.. ఇంటర్ వెయిటేజ్ ఎత్తివేస్తూ నిర్ణయం

    స్థానికులు మాత్రం ఇలాంటి కోబ్రాలను ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. పాములు లేవనే భయంతో ఇన్నాళ్లూ ఇటు వైపు ప్రీగా తిరిగేస్తున్నామని.. కానీ ఇప్పుడు ఈ పామును చూసిన తరువాత ఇటు వైపు పరిశరాలకు రావాలంటేనే భయం వేస్తోంది అంటున్నారు. ప్రస్తుతం కనిపించింది చిన్న పామే అయ్యినా.. దీని తల్లి లేదా.. ఇతర పాములు దగ్గర్లోనే ఉంటాయని.. ఇవన్నీ గిరిజన గ్రామాలకు వచ్చే అవకాశం ఉందని హడలిపోతున్నారు. పిల్లలు, కుటుంబాలతో ఉండే తమకు ఇకపై నిద్రపట్టడం కష్టమే అంటున్నారు. అడవి మొత్తాన్ని అధికారులు పూర్తిగా గాలించి.. వాటిని ఇక్కడ నుంచి తరలించాలని కోరుకుంటున్నారు. కానీ అధికారులు మాత్రం ఎలాంటి భయం అవసరం లేదని భరోసా ఇచ్చి అక్కడి నుంచి వెళ్లి పోయారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు