హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Golden Fish: మత్స్యకారుల పంట పండించిన గోల్డెన్ ఫిష్.. ఈ చేప ఖరుదు తెలిస్తే షాక్ అవుతారు..? ఎందుకంత డిమాండ్

Golden Fish: మత్స్యకారుల పంట పండించిన గోల్డెన్ ఫిష్.. ఈ చేప ఖరుదు తెలిస్తే షాక్ అవుతారు..? ఎందుకంత డిమాండ్

గోల్డెన్ ఫిష్ ధర 2.6 లక్షలు

గోల్డెన్ ఫిష్ ధర 2.6 లక్షలు

Golden Fish: కొన్ని చేపలు మత్స్యకారులకు పంట పండిస్తున్నాయి. లక్షలు కురిపిస్తున్నాయి. తాజాగా అలాంటి కడ్డీ చేప ఒకటి.. ఎవ్వరూ ఊహించని ధరకు పలికింది. దీంతో ఆ మత్స్యకారు కుటుంబం ఆనందాన్ని హద్దులు లేకుండా పోతున్నాయి. ఇంతకీ ఆ చేప అంత ఖరీదు ఎందుకు పలికిందో తెలుసా..?

ఇంకా చదవండి ...

Golden Fish: మత్స్యకారులు (Fishermen) సముద్రం (Sea), నదుల (River)పైనే ఆధారపడి జీవిస్తారు. గంగమ్మతల్లి ఇచ్చిన సంపదతోనే జీవనోపాధి పొందుతారు. వలకు చేప చిక్కితేనే వారి కడుపు నిండుతుంది. ఇలాంటి సందర్భంగాల్లో సముద్రంలో వేటకు వెళ్లాలంటే మత్స్యకారులకు ఏదో తెలియని నైరాస్యం నెలకొంటుంది. ఒక్కోసారి వారం రోజులు నడిసంద్రంలో వేటాడినా రోజుకూలికి సరిపడా డబ్బులు కూడా దక్కవు. అయితే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తూర్పుగోదావరి జిల్లాలోని మత్స్యకారులకు కొన్ని చేపలు లాభాల పంట పండిస్తున్నాయి. అందులో ఒకటి గోల్డెన్ ఫిష్ (Golden Fish).. దీనికి ఉన్నంత గిరాకీ మరే చేపకు లేదని చెప్పాలి. తూర్పు  గోదావరి జిల్లా (East Godavari District) పల్లిపాలెం చేపల మార్కెట్‌కు శనివారం 21 కేజీల బరువుగల కచిడి మగ చేప (Kachidi men Fish) వచ్చింది. దీన్ని బంగారు చేపగా కూడా పిలుస్తారు. మార్కెట్ లో దీనికి చాలా డిమాండ్ ఉంది. గోల్డెన్ ఫిష్  మార్కెట్ లోకి వచ్చిందని తెలియగానే..  దాన్ని కొనేందుకు జనం ఎగబడతారు.. ఈ చేప రుచి ఒక్కసారి చూస్తే చాలు మళ్లీ మళ్లీ తినాలి అనిపిస్తుంది అంటున్నారు స్థానికులు అంతేకాదు.. ఆరోగ్యం పరంగా కూడా ఎన్నో లాభాలు ఉన్నాయని నమ్ముతారు. అందుకే ఇతర చేపలు కంటే గోల్డెన్ ఫిష్ కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అందులోనూ కచిడీ మగ చేప అయితే మరింత డిమాండ్ ఉంటుంది. అద్భుతమైన టేస్టుకు తోడు ఆయుర్వేద ఔషద గుణాలు ఉండడం దీని ప్రత్యేకత. అందుకే అంత ధర పలికేలా చేస్తోందని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు.

తాజాగా అంతర్వేదిలో ఈ అరుదైన కచిడీ రకం చేప చిక్కింది. స్థానిక పాటదారుడు దీన్ని 2.60 లక్షల రూపాయలకు దక్కించుకున్నాడు. కచిడి రకం చేపల్లో ఆడ చేప కంటే మగ చేపకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. చేప పొట్ట భాగంలోని గాల్‌బ్లాడర్‌ను బలానికి వాడే మందుల తయారీలో వినియోగిస్తుంటారు. సర్జికల్‌ సమయాల్లో కుట్లు వేసే దారాన్ని తయారు చేయడంలో కూడా దీని గాల్‌బ్లాడర్‌ను వాడుతుంటారు. అందుకే దీనికి ఇతర చేపల కన్నా భారీ ధరకు కొనేందుకు ముందుకు వస్తారు..

ఇదీ చదవండి: రాజమండ్రిలో చిరంజీవి పర్యటన.. కుటుంబం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు..

అరుదుగా దొరికే ఇటువంటి విలువైన కచ్చిడీ చేపను కలకత్తా ఎగుమతి చేస్తామని వ్యాపారి అంటున్నాడు. సాధారణంగా తూర్పుగోదావరి జిల్లాలో ఈ సమయంలో పులసకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అయిత ఈ ఏడాది పెద్దగా పులస పడడం లేదు. దీంతో మత్స్యకారులు తీవ్ర నిరాశకు గురవుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలో కూడా కొన్ని అరుదైన చేపలు మత్య్సకారుల వలకు చిక్కి.. ఒక్కరోజులోనే కొందరినీ లక్షాధికారులుగా మార్చేస్తున్నాయి. ఇటీవల ఇలా అరుదైన చేపలు తరుచూ మత్స్యకారుల వలకు చిక్కుతూ.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఇదీ చదవండి: పెళ్లి ముచ్చట తీరలేదు.. తోరణాలు తొలగనేలేదు.. అన్యోన్య దాంపత్యం అనుకుంటే.. అంతలోనే..

First published:

Tags: Andhra Pradesh, AP News, East Godavari Dist, Fish

ఉత్తమ కథలు