Home /News /andhra-pradesh /

RARE EGG IN EAST GODAVARI DISTRICT THAT LOOK LIKE SAME MANGO FRUIT NGS

Wonder Egg: కాలజ్ఞానంలో బ్రహ్మంగారూ చెప్పని వింత ఇది.. మామిడి కాయ అనుకుంటున్నారా..? గుడ్డుపై కాలేసినట్టే

మామిడి కాయను పోలీన గుడ్డు

మామిడి కాయను పోలీన గుడ్డు

Wonder Egg: కొన్ని వింత సంఘటనలను మనం నమ్మ లేం.. కానీ నిజమని తెలిసిన తరువాత షాక్ అయ్యేలా చేస్తాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో పండ్లు.. కాయలు వింత వింత ఆకారాల్లో దర్శనమిస్తున్నాయి. దీంతో అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ఓ మామిడికాయ లాంటి గుడ్డు వార్తల్లో నిలిచింది.

ఇంకా చదవండి ...
    Wonder Egg: కాలజ్ఞానంలో బ్రహ్మంగారూ  ముందే ఊహించి  వింత వింత ఘటనలు జరుగుతాయి అన్నారు.. మనుషులు నమ్మలేని వింతలు ఎన్నో ఉంటాయని చెప్పారు. ఇప్పుడు అవన్నీ నిజం అవుతున్నాయి.  కానీ కోడి గుడ్డు ఇలా ఉంటుందని ఎప్పుడూ చెప్పలేదేమో.. సాధారణంగా గుడ్డు అంటే కోలగా.. లేదా రౌండ్ గా ఉంటాయి. ఆ మధ్య ఓ కోడి పెట్టిన గుడ్డు.. అయితే ఆ యజమానులకు పరీక్ష పెట్టటింది. అసలు అది గుడ్డా కాదా అని నిర్ధారించుకోడానికి చాలా సమయంలో పట్టింది. ఎందుకంటే ప్రపంచంలో ఎప్పుడూ లేని విధంగా ఆ గుడ్డు మెలితిరిగి కనిపించింది. దీంతో దాన్ని గుడ్డుగా నిర్ధారించుకోవడానికే చాలా సమయం పడుతోంది. తాజాగా ఓ గుడ్డు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. గుడ్డును చూసేందుకు జనం ఎగబడుతున్నారు. ఇంతకీ ఈ గుడ్డు ప్రత్యేకత ఏంటో తెలుసా..? నిజంగా చూస్తే మీరు కూడా షాక్ తింటారు..

    సాధారణంగా ఎండాకాలం రాగానే.. ఉగాది దగ్గరపడుతుంటే మనకు మొదట గుర్తొచ్చేది మామడి కాయలే, లేలేత మామిడి పూతలు, వేప పూత గుర్తుకోస్తుంది. కొమ్మ కొమ్మకి మామిడి పూతలతో.. మావి చిగురుల చిగురింపులతో కొమ్మకొమ్మకి కోయిల రాగాలతో పకృతి పరవశించి, మామిడిపండ్లు సీజన్ వస్తుంది. మామిడి కాయ షేపు ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఓ కోడి పెట్టిన గుడ్డు సేమ్.. మామాడి కాయ ఆకారంలోనే ఉంది. అంటే మామిడి సీజన్ వచ్చిందని హింటు ఇవ్వాలి అనుకుందో ఏమో కాని.. ఆ కోడి ఎప్పుడూ రౌండ్ గా గుడ్డు పెట్టేది.. కానీ ఇప్పుడు మామిడికాయ ఆకారంలో ఉండే వింత గుడ్డు పెట్టింది. దీంతో ఆ గుట్టు వెరైటీ గా అందర్నీ ఆకట్టుకుంటోంది.



    సాధారణంగా గుడ్లు గుండ్రంగా.. లేక కోలగా.. లేక చిన్నగా, పెద్దగా ఉంటాయి. కాని ఈ గుడ్డు.. ఒక మాడికాయ రూపంలో కనిపించడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇది గుడ్డేనా అని చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు కూడా. అది తెల్ల మామిడి కాయా లేక కోడు గుడ్డు అని గుర్తు పట్టలేకపోతున్నాం అంటున్నారు చూసిన జనం. ఇది తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మాదాపురం రోడ్డులో గల బొమ్మిడి సత్తిబాబు అనే కిరాణా వ్యాపారి షాపులో ఈ గుడ్డు దర్శనమిచ్చింది. అమ్మకం కోసం కోళ్ళ ఫారాల నుండి వచ్చిన గుడ్లు అట్టల్లో ఇలాంటి గుడ్డు వచ్చిందని షాపు యజమాని తెలిపాడు.

    ఇదీ చదవండి : మరోసారి ఆయన్నే నమ్ముకున్న అధినేత.. 2024లో విజయం కోసం కీలక బాధ్యతలు

    అయితే అది మామిడికాయలా కనిపించడంతో మొదట గుడ్డు కాదేమో అనుకున్నాడు. మామిడి కాయను, కోడిగుడ్డు రెండు పక్కపక్కనే పెట్టి చూస్తే ఏమాత్రం తేడా లేకుండా పచ్చ మామిడికాయ, తెల్ల మామిడి కాయాలానే కనిపిస్తోంది. పట్టుకుంటే మాత్రమే ఒక గుడ్డు అనే ఫీలింగ్ కలుగుతోంది అంటున్నాడు ఆ వ్యాపారీ. ఈ గుడ్డును చూసేందుకు స్ధానికులు పెద్ద ఎత్తున షాపు దగ్గరకు వస్తున్నారు. ఆ గుడ్డును చూసి ఆశ్చర్య పోతున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు