Home /News /andhra-pradesh /

RARE CULTURE IN KADAPA DISTRICT ONLY MAN PRAY AND PREPARE PONGAL IN TEMPLE NGS TPT

Pongal Festival: అక్కడ మహిళలకు నో ఎంట్రీ.. పొంగళ్లు పెట్టేదీ మగవారే.. ఎందుకో తెలుసా..?

ఇక్కడ వింత ఆచారం

ఇక్కడ వింత ఆచారం

Pongal Celebrations: ఆంధ్రప్రదేశ్ లో ఓ వింతాచారం గురించి ఎప్పుడైనా విన్నారా..? అక్కడ మహిళలకు అసలు ఆలయంలో ప్రవేశం ఉండదు.. అంతేకాదు.. అసలు అక్కడ పొంగళ్లను కూడా పురుషులే చేస్తారు.. వారే తింటారు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా..?

    Pongal Celebrations in Andhra Pradesh: ఇది మగవాళ్ల ప్రత్యేక పండుగ.. సంక్రాంతి (Sankrati) సంబరాల్లో భాగంగా ప్రత్యేక పూజలు చేస్తారు. సంజీవ రాయునికి మగవాళ్ళే పొంగళ్ళు తయారు చేసి.. నైవేద్యం ఇస్తారు. సర్వసాధారణంగా హిందూ సంప్రదాయంలో పూజలకు మహిళలకే అధిక ప్రాధాన్యత ఉంటుంది. అయితే దేశంలో కొన్ని దేవాలయాల్లో మాత్రమే ఈ వింతైన ఆచారాలు ఉన్నాయి. అరుదుగా మహిళలకు ప్రవేశం లేని ఆలయాలున్నాయి. ఇతర రాష్ట్రాల్లో సంగతి ఎలా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కూడా ఓ దేవాలయం (Temple)లో పొంగళ్లను సమర్పించే విధానంలో వింతైన ఆచారం ఉంది. ఎక్కడయినా దేవుళ్లకు మొక్కులు మొక్కితే ఆడవాళ్లు (Women) పొంగళ్లు పెట్టి ఆ మొక్కును తీర్చుకుంటారు. కానీ ఆ ఆలయంలో మాత్రం.. వింతగా ఆడవాళ్ళకి బదులు మగవాళ్లే పొంగళ్ళు పెట్టి మొక్కులు తీర్చుకుంటారు. కడప జిల్లాలోని పుల్లంపేట మండలంలో తరతరాల నుంచి ఈ ఆచారం ఆనవాయితీగా వస్తోంది. దీనినే శ్రీ సంజీవరాయ స్వామివారి పొంగళ్లుగా పిలుస్తూ ఉంటారు. ప్రతి సంక్రాంతి పర్వదినం ముందు వచ్చే ఆదివారం నాడు సంజీవరాయునికి పొంగళ్ళు పెట్టి మొక్కులు తీర్చుకుంటారు. అది తెలుగు వారికి పెద్ద పండుగ సంక్రాంతి. తిప్పాయపల్లె గ్రామస్థులు మాత్రం సంజీవరాయుని పొంగళ్ళే పెద్దపండుగగా చేసుకుంటారు. సంక్రాంతి కన్నా ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఆదివారం నాడు ఉదయం నుంచే పురుషులు పొంగుళ్ల సామగ్రిని బుట్టలో ఆలయానికి తీసుకువచ్చి పొంగళ్ళు పెట్టి సంజీవరాయునికి నైవేధ్యంసమర్పించారు.

    గ్రామంలోని పురుషులంతా ఆలయానికి వచ్చి పొంగళ్ళుపెట్టారు. ఈ సందర్భంగా సంజీవరాయున్ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. తరువాత పొంగళ్ళను సంజీవరాయుని దగ్గరకు తీసుకువచ్చి నైవేధ్యం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ సంజీవరాయునికి నైవేద్యాలు సమర్పించిన తరువాత ఆ నైవేద్యాన్ని పక్కన పెట్టి 101 బిందెలతోసంజీవరాయునికి ప్రత్యేకంగా అభిషేకం చేశారు. ఆ తరువాత తిరిగి పొంగళ్ళని సంజీవరాయుని దగ్గరకు వచ్చి పూజలు చేసి నైవేద్యాన్ని ఇంటికి తీసుకెళ్తారు. కేవలం ఈ పొంగళిని మగవారు చేయడమే కాదు.. ఇక్కడ వండిన పొంగల్ని అస్సలు స్త్రీలు ముట్టుకోరు.. కేవలం మగవారు మాత్రమే తింటారు. మగవాళ్ళు తప్ప స్త్రీలు ముట్టుకోర అంతేకాదు పొంగళ్ళకు అవసరమైయ్యే సామాను కూడా మహిళలు తాకరు. ఇలా చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయన్నది వారి నమ్మకం.



    కడప జిల్లాలోని పుల్లంపేట మండలం తిప్పాయపల్లెంలోని ఈ వింత ఆచారం కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. ఈ గ్రామస్తులు సంక్రాంతి పండగ కంటే పొంగళ్లు పండగనే ఎంతో ఘనంగా జరుపుకుంటారు.. పెద్ద పండగ కి ముందు వచ్చే ఆదివారం ఇలా చేశారు. ఇందుకోసం ఇతర ప్రాంతాల్లో వేరే చోట ఉన్నవారు కూడా.. స్వగ్రామం చేరుకుని ఇలా పొంగళ్లు పెట్టారు.

    తరతరాలుగా వస్తున్న ఆనవాయితీని తాము కొనసాగిస్తున్నాము అంటున్నారు గ్రామస్థులు.. ఇలా భక్తి శ్రద్ధలతో పొంగళ్లు పెడితే తమ కోరికలు నెరవేరుతున్నాయని.. ఆ స్వామి ఆశీస్సుల వల్లే తాము ఆనందంగా ఉంటున్నామంటున్నారు. ఇంకో విశేషం ఏంటంటే..? ఇక్కడ సంజీవరాయునికి విగ్రహమంటూ లేదు. ఇక్కడ ప్రతిష్టించిన రాతిపై గల శాసనాన్ని వారు దైవంగా భావిస్తారు.. దానినే అంతా పూజిస్తారు. ఇలా మహిళలకు ప్రవేశం లేని, ప్రసాదం స్వీకరణకు కూడా అనుమతి లేని ఏకైక ఆలయంగా తిప్పాయపల్లి సంజీవరాయ ఆలయం ప్రసిద్ధిగాంచింది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు