Wild Animals in AP: తోకపై నిల్చొని ఈలేస్తున్న కోబ్రాలు.. ఏపీలో అరుదైన జీవుల సంచారం.. ఎక్కడంటే..!

ప్రతీకాత్మక చిత్రం

Papikondalu Reserve Forest: ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ లోని అటవీ ప్రాంతాలు. పాపికొండల నుంచి సీతంపేట వరకు విస్తరించి ఉన్న అడవులు అరుదైన వన్యప్రాణులకు అవాసంగా మారింది.

 • Share this:
  ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ లోని అటవీ ప్రాంతాలు. పాపికొండల నుంచి సీతంపేట వరకు విస్తరించి ఉన్న అడవులు అరుదైన వన్యప్రాణులకు అవాసంగా మారింది. ముఖ్యంగా ఏపీలోని తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న పాపికొండలు అభయారణ్యం జీవవైవిధ్యంతో అలరారుతోంది. చట్టూ అడవులు, కొండకోనలు మధ్యలో గలగలపారే గోదారి.. 1,02,2000 హెక్టార్లలో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతం అందాలు చూడటానికి రెండుకళ్లు సరిపోవు. ఈ అద్భుతమైన వన్యప్రపంచంలో మొత్తం 1045 రకాల జంతువులున్నట్లు గుర్తించారు. వీటిలో బెంగాల్ టైగర్స్, చిరుతలు, అలుగులు, పాంగోలిన్ ను, కింగ్ కోబ్రాలు, కొండచిలువలు, కుందేళ్లు, ముంగిసలు, ఎలుగుబంట్లు, కొండగొర్రెలు, జింకలు, అడవి పందులు, ముళ్ల పందులు, అడవి కుక్కల వంటి జంతువులున్నాయి. వీటిలో నాలుగు బెంగాల్ టైగర్స్, 6 చిరుతలు, 30 అలుగులు, నాలుగు కింగ్ కోబ్రాలున్నట్లు అధికారులు గుర్తించారు.

  పక్షుల విషయానికి వస్తే..., నెమళ్లు, గద్దలు, పావురాలు, చిలుకలు, పావురాలు, కోకిల, వండ్రంగి పిట్ట, గుడ్లగూబలు, కొమ్ముకత్తిరి పిట్టల వంటి పక్షులున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. అలాగే ఈ అభయారణ్యం ఎంతో విలువైన వృక్ష సంపదకు నెలవుగా ఉంది. వేగిస, మద్ది, బండారు, తబిస, సోమి, తాని, బెన్నంగి, గరుగుడు, గుంపెన, బిల్లుడు, తునికి, మారేడు తదితర వృక్ష సంపద ఉంది. ఇవిగాక విలువైన వెదురు వనాలు విరివిగా ఉన్నాయి.

  పెద్దపులి (ఫైల్)

  ఇది చదవండి: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలోనే సర్వదర్శనం


  చూడటానికి విభిన్నమైన రంగులతో ముచ్చటగొలిపే సీతాకోక చిలుకలు ఇక్కడ దాదాపు 130 రకాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో విజేతగా నిలిచిన ఆరెంజ్ ఒకలీఫ్ సీతాకోక చిలుక ఇక్కడే ఉంది. ఇక అత్యంత అరుదైన వన్యప్రాణుల్లో ఒకటైన అలుగులు ఇక్కడ 30కి పైగా ఉన్నాయి. పొలుసులుతో చూడటానికి విభిన్నింగ్ ఉండే అలుగులను పాంగోలిన్ అని కూడా పిలుస్తారు.  ఐతే ఈ అడవి జంతువులు అప్పుడప్పుడు గిరిజన గ్రామాల్లోకి వచ్చి కలకలం రేపుతుంటాయి.

  ఇది చదవండి: ప్రియుడి కోసం దేశంకాని దేశం వచ్చిన యువతి... ఇంతలోనే ఊహించని కష్టం.. పోలీసులే ఆమె పాలిట దేవుళ్లు..  కింగ్ కోబ్రా కేరాఫ్ పాపికొండలు..
  కింగ్ కోబ్రా.. సాధారణంగా వైల్డ్ లైఫ్ కు సంబంధించిన ఛానల్స్ లోనే కనిపిస్తుంటుంది. కానీ పాపికొండల్లో ఏకంగా 30 అడుగుల పొడవైన కింగ్ కోబ్రాలున్నట్లు తెలుస్తోంది. పగలు చెట్లపై నిద్రించే కోబ్రాలు.. రాత్రి సమయంలో తోకపై నిటారుగా నిలబడి అరుస్తున్నట్లు గిరిజనులు చెబుతున్నారు. అప్పుడప్పుడు ఇవి గ్రామాల్లోకి వచ్చి స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

  ఇది చదవండి: వైఎస్ జగన్ సిమ్లా టూర్ వెనుక అసలు సీక్రెట్ వేరే ఉందా..? అందుకే అక్కడికి వెళ్లారా..?


  40 ఏళ్ల క్రితం అంటే 1978లో పాపికొండలు రిజర్వ్ ఫారెస్ట్ 591 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే  ఉండేది. జాతీయ పార్కుగా ప్రకటించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం దీని పరిధిని విస్తరించింది. జంతు, వృక్ష సంపదను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనివల్ల ఇక్కడ జంతు జాతుల సంఖ్య మరింత పెరిగిందని వైల్డ్‌ లైఫ్‌ అధికారులు చెబుతున్నారు.  ఐతే క్రూరమృగాల సంఖ్య కాస్త తక్కువగా ఉండటంతో  గిరిజనులకు కాస్త ఊరటనిస్తోంది.
  Published by:Purna Chandra
  First published: