Home /News /andhra-pradesh /

RAMANA DIKISHITULU CRITICIZES TIRUMALA TIRUPATI DEVASTHANAM AGAIN AK

టీటీడీ విఫలమైందంటూ రమణ దీక్షితులు విమర్శలు

రమణ దీక్షితులు(ఫైల్ ఫోటో)

రమణ దీక్షితులు(ఫైల్ ఫోటో)

Ramana Dikshitulu: అయితే కొంతకాలంగా రమణ దీక్షితులు టీటీడీ తీరును తప్పుబడుతుండటం చర్చనీయాంశంగా మారింది.

    కరోనా విజృంభిస్తున్న సమయంలో టీటీడీ వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని గతంలో పలుసార్లు విమర్శించిన టీటీడీ ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు మరోసారి ట్విట్టర్ వేదికగా టీటీడీపై విమర్శలు చేశారు. అర్చకులకు రక్షణ కల్పించడంలో టీటీడీ విఫలమైందని ఆయన ఆరోపించారు. గతంలో బలవంతంగా పదవీ విరమణ చేసిన టీటీడీ సీనియర్ అర్చకుడితో పాటు ఇటీవల కరోనా కారణంగా చనిపోయిన అర్చకుడి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా సీఎం జగన్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి విజ్ఞప్తి చేశారు.



    అయితే కొంతకాలంగా రమణ దీక్షితులు టీటీడీ తీరును తప్పుబడుతుండటం చర్చనీయాంశంగా మారింది. అర్చకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొంతకాలం శ్రీవారి దర్శనాలు ఆపాలని ఆయన గతంలో సూచించారు. ఈ క్రమంలో టీటీడీ తీరుపై విమర్శలు గుప్పించారు. అయితే అప్పట్లో రమణ దీక్షితులు తీరును టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తప్పుబట్టారు. ఏమైనా సమస్యలు ఉంటే బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ నేపథ్యంలో రమణ దీక్షితులు మరోసారి టీటీడీ తీరుపై విమర్శలు చేయడంతో... ఆయన విషయంలో టీటీడీ ఏ రకంగా వ్యవహరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Ramana dikshithulu

    తదుపరి వార్తలు