Home /News /andhra-pradesh /

RAMANA DEEKSHITULU MEETS YS JAGAN IN TIRUMALA HE MAY RE ENTRY INTO TIRUMALA TEMPLE SK

జగన్‌తో రమణదీక్షితులు భేటీ...శ్రీవారి ఆలయంలోకి రీఎంట్రీ.?

జగన్‌తో రమణదీక్షితులు, టీటీడీ ఈవో

జగన్‌తో రమణదీక్షితులు, టీటీడీ ఈవో

ఇప్పడు జగన్ అధికారంలోకి రావడం...ఆయన్ను రమణ దీక్షితులు కలవడం చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్‌ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం ఖాయమని..త్వరలోనే తిరుమల ఆలయంలోకి రమణదీక్షితులు పునప్రవేశం చేస్తారని ప్రచారం జరుగుతోంది.

    తిరుమల శ్రీవారి ఆలయంలోకి రమణదీక్షితులు రీఎంట్రీ ఇచ్చే అవకాశముంది. ఆలయ ప్రవేశం విషయంలో రమణదీక్షితులుకు లైన్ క్లియర్ అయినట్లే తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న వైఎస్ జగన్ పద్మావతి అతిథి గృహంలో బసచేశారు. ఈ సందర్భంగా ఏపీ కాబోయే సీఎంను రమణదీక్షితులు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ఆలయంలో కలుద్దామని రమణదీక్షితులుకు చెప్పారు జగన్. ఐతే ఆలయంలోకి తనను అనుమతించడం లేదని ఆయన చెప్పడంతో..అవన్నీ తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు జగన్.

    ఎన్నికల ఫలితాలకు నాలుగు రోజుల ముందు కూడా జగన్‌ను కలిశారు రమణదీక్షితులు. పులివెందులో ప్రజాదర్బార్ సందర్భంగా జగన్‌తో సమావేశమై ఆయన్ను ఆశీర్వదించారు. టీటీడీ ప్రధాన అర్చకుడి బాధ్యతల నుంచి తనను తొలగింపుపై పునరాలోచించాలని ఆ సందర్భంగా జగన్‌ను కోరారు.

    కాగా, రమణ దీక్షితులు టీటీడీ ప్రధాన అర్చకులుగా ఉన్న సమయంలో పలు వివాదాల్లో ఉన్నారు. ప్ర‌భుత్వంపై బ‌హిరంగంగా ఆరోపణలు చేసి దుమారం రేపారు. టీటీడీలో అవినీతి, అక్రమాలు, ఆగమశాస్త్ర ఉల్లంఘనలు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. తిరుమ‌లలో జ‌రిగిన త్ర‌వ్వ‌కాలపై వచ్చిన ఆరోపణలు, బిజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్‌షాకు స్వాగ‌తం ప‌ల‌క‌టం, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామితో చర్చలు వంటి పరిణామాల నేపథ్యంలో దీక్షితులుపై టీటీడీ వేటు వేసింది.

    రమణదీక్షితుల పట్ల టీటీడీ, ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై గతంలో వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు వైఎస్ జగన్ సైతం మద్దతు ప్రకటించారు. ఇప్పడు జగన్ అధికారంలోకి రావడం...ఆయన్ను రమణ దీక్షితులు కలవడం చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్‌ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం ఖాయమని..త్వరలోనే తిరుమల ఆలయంలోకి రమణదీక్షితులు పున:ప్రవేశం చేస్తారని ప్రచారం జరుగుతోంది.

    First published:

    Tags: Andhra Pradesh, AP News, Ramana dikshithulu, Tirumala news, Tirumala Temple, Tirupati, Ttd

    తదుపరి వార్తలు