హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

చంద్రబాబు, లోకేష్‌పై రామ్ గోపాల్ వర్మ మరో దుమారం...

చంద్రబాబు, లోకేష్‌పై రామ్ గోపాల్ వర్మ మరో దుమారం...

స్థానిక నాయకత్వాలను కొత్త వారికి ఇవ్వాలని కొన్ని చోట్ల నుంచి టీడీపీ శ్రేణులు కోరడంతో... చంద్రబాబు అండ్ లోకేశ్ ఆ దిశగా దృష్టి పెట్టారని సమాచారం.

స్థానిక నాయకత్వాలను కొత్త వారికి ఇవ్వాలని కొన్ని చోట్ల నుంచి టీడీపీ శ్రేణులు కోరడంతో... చంద్రబాబు అండ్ లోకేశ్ ఆ దిశగా దృష్టి పెట్టారని సమాచారం.

బాహుబలి సినిమాలో ప్రభాస్ శివలింగాన్ని మోసుకుని వస్తున్నట్టు రామ్ గోపాల్ వర్మ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాను ఎట్టకేలకు ధియేటర్లకు తీసుకొస్తున్నట్టు చూపించాడు.

  వివాదాస్పద చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన మార్క్ చూపించారు. ఈ సారి జగన్, విజయసాయిరెడ్డిని తన పబ్లిసిటీ కోసం వాడుకున్నారు. రామ్ గోపాల్ వర్మ తీసిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా ఎన్నో ఆటుపోట్ల తర్వాత చివరకు రిలీజ్‌కు రెడీ అయింది. దీంతో తనను తాను బాహుబలిగా పోల్చుకున్నాడు వర్మ. బాహుబలి సినిమాలో ప్రభాస్ శివలింగాన్ని మోసుకుని వస్తున్నట్టు రామ్ గోపాల్ వర్మ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాను ఎట్టకేలకు ధియేటర్లకు తీసుకొస్తున్నట్టు చూపించాడు. అదే సమయంలో మరో మార్ఫింగ్ ఫొటోను కూడా వర్మ ట్వీట్ చేశాడు.

  అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు ఈనెల 12న రిలీజ్ కానుండడంతో జగన్ మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి సంబరాలు చేసుకుంటున్నట్టుగా ఓ ఫొటోను మార్ఫింగ్ చేశాడు. వారిద్దరూ ఒకరినొకరు హత్తుకుని ఆనందంలో ఉంటారు. వారి వెనుక టీవీ స్క్రీన్ మీద అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా డిసెంబర్ 12న రిలీజ్ అవుతున్నట్టు బ్రేకింగ్ ఉంది. ఈ ఫొటోను ట్వీట్ చేసిన వర్మ.. వారిద్దరూ తనకు తెలియదని, వారు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో కూడా తెలియదని చెప్పాడు.

  వాస్తవానికి రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసిన ఫొటో ఎన్నికల ఫలితాల నాటిది. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీకిి 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు వచ్చాయి. జగన్ సీఎం అయ్యారు. దీంతో జగన్, సాయిరెడ్డి ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు. అప్పటి ఫొటోను వర్మ ఇప్పుడు తన సినిమా ప్రమోషన్ కోసం మార్ఫింగ్ చేసి వాడుకున్నాడు. మరోవైపు చంద్రబాబునాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఫొటోలను కూడా తన ప్రమోషన్ కోసం వాడుకున్నాడు.

  అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా మీద చాలా దుమారం రేగింది. ఈ సినిమా పేరు మొదట కమ్మరాజ్యంలో కడప రెడ్లు అని పెట్టాడు వర్మ. రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టేలా ఉందంటూ కొందరు సెన్సార్ బోర్డును ఆశ్రయించారు. మరోవైపు కేఏ పాల్ హైకోర్టులో పిిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తాను సినిమా పేరును అమ్మ రాజ్యంలో కడప బిడ్డలుగా మారుస్తానని ప్రకటించాడు. ఆ తర్వాత కూడా సినిమాకు సెన్సార్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో వర్మ రివైజింగ్ కమిటీని ఆశ్రయించాడు. వారు సినిమా రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Ap cm ys jagan mohan reddy, KAMMA RAJYAMLO KADAPA REDDLU, RGV, Vijayasai reddy

  ఉత్తమ కథలు