అన్నిదానాల్లోని అన్నదానం గొప్ప అంటారుకాని ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి అవయవదానం(organ donation) చేస్తే ఓ నిండు ప్రాణం నిలబడుదుతుంది. అందుకే ఈ కాలంలో అన్ని దానాల్లోని అవయవదానం గొప్పదని చెప్పాల్సి ఉంటుంది. ఏపీలో అవయవదానాలు రెండేళ్లలోనే రెట్టింపు అయ్యాయి. 2020లో 122 అవయవదానాలు జరగ్గా, 2022 చివరి నాటికి 273కు చేరాయి. అంటే రెట్టింపు కన్నా కొంత ఎక్కువే పెరిగాయని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ (AP health department) ఉన్నతాధికారులు తెలిపారు. ఇక జీవించి ఉన్న వ్యక్తుల నుంచి కూడా అవయవదానాలు రెట్టింపు అయ్యాయి. 2020లో జీవించి ఉన్న వ్యక్తుల అవయవదానాలు 118 నమోదు కాగా, అది 2022 నాటికి 251కి పెరిగాయి. దేశవ్యాప్తంగా 2020లో 7159 అవయవదానాలు జరగ్గా, 2022 చివరినాటికి 13695కు చేరుకున్నాయి. ఏపీలో అవయవదానం చేసేందుకు తాజాగా 4.48 లక్షల మంది ముందుకు వచ్చారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ రాజ్యసభలో వెల్లడించారు. అవయవదానానికి ఏపీలో అనువైన వాతావరణం ఉండటమే ఇందుకు కారణం అన్నారు.
దేశంలో అవయవ దానాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాటు, భారతదేశంలో గత మూడేళ్లలో ఎన్ని అవయవ దానాలు జరిగాయి, ఎంత మంది వ్యక్తులు అవయవ దానం కోసం నమోదు చేసుకున్నారనే దాని గురించి అందరూ తెలుసుకోవాలని రాజ్యసభ సభ్యుడు నత్వానీ (Parimal Natwani) అన్నారు. భారతదేశంలో అవయవదానంపై అవగాహన పెంచేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. NOTTO (నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్), ROTTO (ప్రాంతీయ అవయవం & కణజాల మార్పిడి సంస్థలు), SOTTOలు (స్టేట్ ఆర్గాన్ & టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్స్) ద్వారా బహుళ భౌతిక, టీవీ, డిజిటల్ , సోషల్ మీడియా ఛానెల్‌లు వారి ప్రోగ్రామ్‌ల ద్వారా అవయవదానాన్ని బాగా ప్రచారం చేయాలని కేంద్ర మంత్రి విజ్ఙప్తి చేశారు.
అవయవదానం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించడం ద్వారా లక్షలాది మంది అవయవాలు దానం చేసేందుకు వారి పేర్లు నమోదు చేసుకునే అవకాశం ఉంది. మరణించిన దాత నుండి అవయవ మార్పిడి అవసరమయ్యే రోగుల నమోదు కోసం రాష్ట్ర నివాస అవసరాన్ని తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.కొత్త మార్గదర్శకాల ప్రకారం, మరణించిన దాత అవయవాన్ని స్వీకరించడానికి రిజిస్ట్రేషన్ కోసం, కనీస వయసు 65 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి తీసివేశారు. దీంతో అవయవదానంతోపాటు స్వీకరించడం కూడా మరింత సులువుగా మారుతుందని కేంద్ర మంత్రి రాజ్యసభకు తెలిపారు.
Balakrishna Warning: చిటికేస్తే చాలు.. మూడో కన్ను తెరవమంటావా? వైసీపీ ఎమ్మెల్యేకు బాలయ్య వార్నింగ్..!
YS Jagan: వైసీపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కలవరం.. మంత్రుల ముందు పెద్ద సవాల్
అవయవదానం చాలా సందర్భాల్లో మరణించిన తరవాతే ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని అవయవాల విషయంలో బంధువులు వారి కుటుంబ సభ్యులకు బతికుండగానే అవయవాలు దానం చేయవచ్చు. అయితే చాలా సందర్భాల్లో చనిపోయిన కొద్ది గంటల్లో అవయవాలు సేకరించాల్సి ఉంటుంది. కొందరు ప్రమాదాలకు లోనై కోమాలోకి వెళ్లి, ఇక కోలుకునే పరిస్థితులు లేకుండా డాక్టర్ల సలహా మేరకు అవయవదానం చేయవచ్చు. ప్రజల్లో అవయవదానంపై అవగాహన పెంచడం ద్వారా దేశంలో లక్షలాది మందికి అవసరం అవుతున్న గుండె, లివర్, నేత్రాలు సమకూర్చవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Parimal Nathwani